Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ: తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడి గండం?.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?

Light rain is predicted at INDvsNZ first T20I venue

ప్రపంచకప్ ముగిసిన రోజుల వ్యవధిలోనే భారత జట్టు మరో సిరీస్‌కు సిద్ధమైంది. న్యూజిల్యాండ్ వేదికగా జరిగే ద్వైపాక్షిక సిరీస్‌కు రెడీ అయింది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు న్యూజిల్యాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు.

సెమీస్ ఓటమి తర్వాత తొలి మ్యాచ్

సెమీస్ ఓటమి తర్వాత తొలి మ్యాచ్

ప్రపంచకప్‌లో అద్భుతంగా పోరాడి సెమీఫైనల్ చేరిన భారత్, న్యూజిల్యాండ్ జట్లు రెండూ.. నాకౌట్ మ్యాచులో పోరాటం చూపించలేక వెనుతిరిగాయి. పాకిస్తాన్ చేతిలో కేన్ విలియమ్సన్ టీం, ఇంగ్లండ్ చేతిలో రోహిత్ సేన ఘోరంగా ఓడిపోయాయి. ఈ ఓటమి బాధను పూర్తిగా మర్చిపోకముందే కివీస్ టూర్ ప్రారంభమైపోవడం గమనార్హం. మరి ఈ టోర్నీలో పాండ్యా నాయకత్వంలోని జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.

పిచ్ ఎవరికి అనుకూలం?

పిచ్ ఎవరికి అనుకూలం?

భారత్, న్యూజిల్యాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు వెల్లింగ్టన్ వేదిక కానుంది. ఇక్కడ గత మూడు మ్యాచులు చూస్తే.. పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరిస్తుందని తెలుస్తుంది. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉండే ఈ పిచ్‌పై కనీసం 160 పరుగుల స్కోరు చేస్తేనే గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ మ్యాచుల్లో విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

వాతావరణం ఎలా ఉంది?

వాతావరణం ఎలా ఉంది?

భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు భారత్, న్యూజిల్యాండ్ మ్యాచ్ టాస్ వేస్తారు. ఆ తర్వాత అరగంటకు మ్యాచ్ మొదలవుతుంది. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇక్కడ స్వల్పంగా వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యచ్ పూర్తయిన తర్వాత వర్షం పడితే బాగుండని దేవుడికి మొక్కుకుంటున్నారు.

Story first published: Friday, November 18, 2022, 8:36 [IST]
Other articles published on Nov 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+