క్రికెటర్లు ఒంటరితనాన్ని అనుభవిస్తారు: మానసిక సమస్యతో క్రికెట్‌కు విరామంపై ఆకాశ్ చోప్రా (వీడియో)

హైదరాబాద్: మానసిక సమస్యతో మార్కస్ ట్రెస్కోథిక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్నప్పుడు... అప్పట్లో అతడి నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారు. అయితే, రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఇదే కారణంతో అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ప్రకటించాడు.
ఇప్పుడు మాత్రం మ్యాక్స్‌వెల్ నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలతో జట్టు నుంచి తప్పుకున్నట్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రికెట్ కన్నా ముఖ్యమైనవి ఉన్నాయని మాక్స్ వెల్ గ్రహించాడని సహచర క్రికెటర్ క్రిస్‌లిన్ అతడి నిర్ణయాన్ని స్వాగతించాడు.

ఆకాశ్ చోప్రా తన ట్విట్టర్‌లో
తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం మ్యాక్స్ వెల్ నిర్ణయాన్ని స్వాగతించాడు. ఈ మేరకు ఆకాశ్ చోప్రా తన ట్విట్టర్‌లో "భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు తదితర జట్లకు ప్రాతినిధ్యం వహించడం అద్భుతంగా ఉంటుందని మీరు అనుకోవచ్చు. ఫైవ్ స్టార్ హోటళ్లలో బస, విమానాల్లో ప్రయాణం, వారి ఆటోగ్రాఫుల కోసం లక్షల మంది ఎదురుచూస్తుండటం. ఇంతకన్నా ఇంకే కావాలని అనుకోవచ్చు. ఇవన్నీ నిజం కాకపోవచ్చు" అని అన్నాడు.
క్రికెటర్లు ఒంటరితనం అనుభవిస్తారు
"ఎందుకంటే కొన్నిసార్లు క్రికెటర్లు ఒంటరితనం అనుభవిస్తారు. ఆటగాళ్లు జట్టును కుటుంబంలా భావిస్తారు. మానసికంగా కుదురుకోకపోతే అన్నిటినీ జట్టుతో పంచుకోలేరు. సహచరులతో మంచి అనుబంధం ఉంటుంది. అయినప్పటికీ కొన్ని విషయాలు వారికి చెప్పలేరు. అవి మున్ముందు సమస్యలుగా మారతాయి" అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

ఇటీవలే మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ
'బయటికి బాగానే ఉన్నట్టు కనిపించడం చాలా సులభం. చాలా మంది అభిమానుల ముందు ఆటగాళ్ళు ఆడుతారు కాబట్టి అలా ఉంటారు. నేను మానసిక సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అందువల్లే క్రికెట్ నుంచి స్వల్ప విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. క్రికెట్ ఆస్ట్రేలియాకు కూడా విషయాన్ని చెప్పా' అని అన్నాడు.

మ్యాక్స్‌వెల్ నిర్ణయాన్ని స్వాగతించిన క్రికెట్ ఆస్ట్రేలియా
మ్యాక్స్‌వెల్ తన మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను అధిగమించడంలో నిమగ్నమయ్యాడు. త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుంటాడు అని ఆస్ట్రేలియా జట్టు మానసిక వైద్యుడు మైఖేల్ లాయిడ్ తెలిపారు. మ్యాక్స్‌వెల్ తన మానసిక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతను ఆటకు కొన్ని రోజులు దూరంగా ఉంటాడు. ఈ సమస్యలను అదిగమించడంలో నిమగ్నమయ్యాడు. త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుంటాడు' అని మైఖేల్ చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications