Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాడ్జ్ కోసం ధోని సాహసం: రెండు వారాల ట్రైనింగ్‌కు

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా పొందిన సంగతి తెలిసిందే. లెప్టినెంట్ కల్నల్ హోదా ధోని పలుమార్లు మిలిటరీ బేస్‌లను సందర్శించాడు. టెస్టు క్రికెట్ వీడ్కోలు పలికి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ధోని ఆగ్రాలోని పారా రెజిమెంట్‌లో రెండు వారాల పాటు మిలిటరీ ట్రైనింగ్‌కు హాజరయ్యాడు.

రెండు వారాల ట్రైనింగ్ అనంతరం ధోని ఏఎన్-32 యుద్ధ విమానంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి ఐదుసార్లు పారా జంప్ చేయాల్సి ఉంటుందని రక్షణ శాఖ ప్రత్యేక ప్రతినిధి శితాంషు కౌర్ తెలిపారు. ఈ పారా జంపింగ్‌ను ధోని విజయవంతంగా పూర్తి చేస్తే అతడికి బ్యాడ్జ్‌ను ప్రదానం చేస్తారు.

Lieutenant Colonel MS Dhoni undergoing training with Army’s elite Para brigade

గతంలో ధోని లడఖ్‌లో ఆర్మీ నిర్మించిన గ్రౌండ్‌ను ప్రారంభించాడు. ధోని మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీని ప్రోత్సహించేందుకు తాను సరిహాద్దుల్లో పర్యటించడం లేదని తెలిపాడు. ఇలాంటి అరుదైన సంఘటనలతో ఇండియన్ ఆర్మీలో పాలుపంచుకోవడం ఓ గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. క్రికెట్‌లోకి రాకముందు సైన్యంలో చేరాలని ఆశించాను.

అయితే రైల్వేకు వెళ్లాను. అదృష్టవశాత్తూ ఇప్పుడు సైన్యంలో భాగమయ్యాను. క్రికెట్‌ నుంచి వైదొలగిన తర్వాత కచ్చితంగా భారత ఆర్మీలో చేరి దేశసేవ చేస్తానని కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని గతంలో అన్నాడు. ధోనీ ఇండియన్ ఆర్మీ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+