Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

The Hundred League : ఒంటిచేత్తో గుంజి కొట్టిన లియామ్ లివింగ్ స్టోన్.. స్టాండ్స్‌లోకి దూసుకెళ్లిన బంతి

Liam Livingstone Single Handedly Hit six In Rishabh Pant Style

ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా ఆగస్టు 15న బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య జరిగిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో బర్మింగ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఒంటిచేత్తో సిక్స్ కొట్టాడు. అతని సిక్స్ భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ తరహా సిక్సులాగా అనిపించింది. పంత్ సైతం ఒంటి చేత్తో సిక్సులు కొట్టడంతో సిద్ధహస్తుడనే సంగతి తెలిసిందే. లివింగ్‌స్టోన్ విధ్వంసంతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు బర్మింగ్ హామ్ ఫీనిక్స్‌కు మరో 14బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. బర్మింగ్ హమ్ కెప్టెన్ మొయిన్ అలీ సైతం హాఫ్ సెంచరీతో రఫ్ఫాడించాడు. మొయిన్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ఇక ట్రెంట్ రాకెట్ కెప్టెన్ అయిన లూయిస్ గ్రెగొరీ తన మీడియం పేస్ బౌలింగ్లో లివింగ్‌స్టోన్‌కి ఫుల్ టాస్ డెలివరీ వేశాడు. లివింగ్ స్టన్ కాస్త షఫుల్ చేసిన తర్వాత ఒంటి చేత్తో మిడ్ వికెట్ వైపు మీదుగా బంతిని బాదాడు. అది నేరుగా స్టాండ్స్‌లో పడింది. ఈ సిక్స్ ద్వారా లివింగ్‌స్టోన్ తన యాభైని పూర్తి చేసుకోవడంతో పాటు జట్టు తరఫున విన్నింగ్ షాట్‌ ఆడాడు. అతను తనదైన స్టైల్లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఎడాపెడా బాదుతూనే ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. బర్మింగ్‌హమ్ ఫీనిక్స్ టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ట్రెంట్ రాకెట్స్ బ్యాటింగ్లో తొలి 54బంతుల్లో కేవలం 53పరుగులకే 6వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. జట్టులోని అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, కోలిన్ మున్రో, ఇయాన్ కాక్‌బెయిన్, సమిత్ పటేల్ రాణించలేకపోయారు.

సెలెక్టర్లు చేసిందే కరెక్ట్ - ఇషాన్ కిషన్ *Cricket | Telugu OneIndia

అయితే కెప్టెన్ గ్రెగొరీ (22 బంతుల్లో 35), స్టార్ ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ (25 బంతుల్లో 55) చివర్లో బాదాడంతో ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100బంతుల్లో 140పరుగుల మార్కును దాటింది. బర్మింగ్ హమ్ బౌలర్లలో బెన్నీ హోవెల్ (3 వికెట్లు), మోయిన్ (1 వికెట్), ఇమ్రాన్ తాహిర్ (1 వికెట్), టామ్ హెల్మ్ (1 వికెట్) తీశారు. ఇక తర్వాత ఛేదనకు దిగిన బర్మింగ్ హమ్ ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. లివింగ్‌స్టోన్ మరియు మొయిన్ అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేసి జట్టును సులభంగా విజయతీరాలకు చేర్చారు. ట్రెంట్ రాకెట్స్ జట్టులో పేసర్ ల్యూక్ వుడ్ మాత్రమే మూడు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, August 16, 2022, 20:30 [IST]
Other articles published on Aug 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+