Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్

IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ 2025 చాలా దారుణంగా ఉంది. ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు రాజస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ నితీష్ రాణా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. నిజానికి నితీష్ రాణా గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. నితీష్ రాణా స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన బలమైన ఆటగాడిని జట్టులో చేర్చారు.

జట్టులోకి దక్షిణాఫ్రికా ఆటగాడు
రాజస్థాన్ స్టార్ ఆటగాడు నితీష్ రాణా టోర్నమెంట్ నుంచి తప్పుకున్న తర్వాత రాజస్థాన్ రాయల్స్ 19 ఏళ్ల దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం ఆటగాడు లువాన్-డ్రే ప్రిటోరియస్‌ను జట్టులోకి చేర్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇప్పటికే ఎడమచేతి వాటం బ్యాటర్ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. ఇద్దరు లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉండగానే.. మరో ఎడమచేతి వాటం బ్యాటర్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేర్చుకుంది.

Lhuan-dre Pretorius Replaces Nitish Rana in Rajasthan Royals for IPL 2025

లువాన్ ఇప్పటికే దక్షిణాఫ్రికా ప్రీమియర్ టీ20 క్రికెట్ లీగ్ అయిన SA20లో పార్ల్ రాయల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. SA20 2025లో ప్రిటోరియస్ క్రికెట్ అభిమానులలో చాలా ఖ్యాతిని సంపాందించాడు. తన మొదటి ఎలైట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్ ఆడిన ఈ యువకుడు 166.81 స్ట్రైక్ రేట్‌తో 397 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

గాయాలతో ఇబ్బంది పడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు
ఈ టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్ల గాయాలతో ఇబ్బంది పడుతోంది. కెప్టెన్ సంజు శాంసన్ కూడా గాయం కారణంగా అనని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇది కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ కూడా గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరంగా ఉన్నాడు.

Story first published: Thursday, May 8, 2025, 11:32 [IST]
Other articles published on May 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+