హైదరాబాద్: క్యాన్సర్‌ను జయించిన టీమిండియా వెటరన్ క్రికెట్ యువరాజ్ సింగ్ 'యువీకెన్' అనే ఫౌండేషన్‌ను నెలకొల్పి క్యాన్సర్‌పై అవహగాన కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ పట్ల యువరాజ్ చేస్తున్న అవగాహన కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.
ఈ మేరకు యువరాజ్‌కు ప్రధాని మోడీ లేఖ రాశారు. సమాజానికి సేవ చేయాలన్న యువరాజ్ ఆలోచన గొప్పదని, యువీ ఇలాగే తన సేవా కార్యక్రమాలను ఉత్సాహవంతంగా కొనసాగిస్తాడని ఆశిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. గొప్ప క్రికెటర్, క్యాన్సర్‌ని జయించిన వ్యక్తి అయిన యువీని భారతీయులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారని అన్నారు.

ప్రధాని మోడీ లేఖ రాయడంతో యువీ హర్షం వ్యక్తం చేశాడు. మోడీ నుంచి ఈ లేఖ రావడం తమ పౌండేషన్‌కు లభించిన గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. అందరం సమిష్టిగా కలిసి శ్రమిస్తే ప్రపంచంలో ఎటువంటి మార్పు అయినా సాధ్యమేనని తమ ఫౌండేషన్ గట్టిగా నమ్ముతుందని చెప్పాడు. ఒకరి జీవితంలో వెలుగులు నింపడం కంటే గొప్పదైన రివార్డ్ మరొకటి లేదని పేర్కొన్నాడు.