
టాప్-3 వాళ్లే..
ఐపీఎల్ ద్వారా అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్లలో టాప్-3లో టీమిండియా స్టార్లే ఉన్నారు. భారత క్రికెట్‌ను ఎన్నో విలువైన మైలురాళ్లకు చేర్చిన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతను ఐపీఎల్‌లో రూ.164.8 కోట్లు సంపాదనతో ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఇప్పటి వరకు రూ.162.6 కోట్లు సంపాదించాడు. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ద్వారా రూ.158.2 కోట్లు సంపాదించి మూడో స్థానంలో నిలిచాడు.

మాజీల హవా..
ఐపీఎల్ నుంచి బాగా వెనకేసుకున్న వారిలో నాలుగో స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, 'మిస్టర్ ఐపీఎల్' అని పేరొందిన సురేశ్ రైనా ఉన్నాడు. అతను ఈ ఫ్రాంచైజీ లీగ్ ద్వారా రూ.110.7 కోట్లు సంపాదించాడు. ఐదో స్థానంలో రూ.102.5 కోట్ల సంపాదనతో 'మిస్టర్ 360 డిగ్రీస్' ఏబీ డివిల్లీర్స్ ఉన్నాడు. ఆరో స్థానంలో ఉన్న విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్‌లో 101.2 కోట్లు సంపాదించాడు.

ఓపెనర్లు, ఆల్‌రౌండర్లు..
ఐపీఎల్‌లో బాగా సంపాదించిన వారి జాబితాలో చివరి నాలుగు స్థానాలను ఓపెనర్లు, ఆల్‌రౌండర్లు ఆక్రమించారు. ఏడో స్థానంలో ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఐపీఎల్ సంపాదన రూ.94.6 కోట్లు. తర్వాతి ర్యాంకులో రూ.93 కోట్లతో రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇప్పుడు క్రికెట్‌కు దూరంగా ఉంటున్న మాజీ ఆల్‌రౌండర్ యువజార్ సింగ్.. రూ.84.6 కోట్ల సంపాదనతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న టీమిండియా స్టార్ ఓపెనర్, 'గబ్బర్' శిఖర్ ధవన్.. రూ.84.6 కోట్లతో చివరి స్థానంతో సరిపెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications












