For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India: సెమీస్‌లో ఓడిన టీమిండియాకు దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

lets calculate the prize money India will get after Semifinal loss

టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో రాణించిన భారత జట్టు సెమీఫైనల్‌లో చిత్తుగా ఓడింది. ఈ టోర్నీలో టీమిండియా స్టార్లు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించారు. అయినా సరే భారత జట్టుకు ట్రోఫీ అందించలేకపోయారు. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటం, ఓపెనర్లు వరుస వైఫల్యాలు టీమిండియాను దెబ్బతీశాయి.

భారత్‌కు దక్కే ప్రైజ్ మనీ..

భారత్‌కు దక్కే ప్రైజ్ మనీ..

గ్రూప్ దశలో జోరు చూపించి, సెమీస్‌లో ఓడిన భారత జట్టుకు ప్రైజ్ మనీ కింద ఎంత సొమ్ము అందుతుందో తెలుసా? అక్షరాలా 4 లక్షల డాలర్లు. మనలెక్కల్లో రూ.3.22 కోట్లపైనే అన్నమాట. సెమీఫైనల్‌లోనే ఓడిన కివీస్‌కు కూడా ఇంతే మొత్తం దొరుకుతుంది. దీనికితోడు గ్రూప్ దశలో ఈ జట్లు సాధించిన ఒక్కో విజయానికి అదనంగా 40 వేల డాలర్లు (రూ.32 లక్షలపైగా) అందుతాయి. గ్రూప్ దశలో భారత జట్టు నాలుగు విజయాలు సాధించింది. అంటే సెమీస్ ప్రైజ్ మనీతో పాటు అదనంగా రూ.1.2 కోట్లపైగా నగదు బహుమతి లభిస్తుంది.

టైటిల్ కోసం తలపడే జట్లకు

టైటిల్ కోసం తలపడే జట్లకు

ఇక మిగతా జట్లకు దక్కే ప్రైజ్ మనీ లెక్కలు చూసుకుంటే.. ఈ టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు అందుతాయి. అవే మనలెక్కల్లో చూసుకుంటే సుమారు రూ.13 కోట్లు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు అందులో సగం దక్కుతుంది. ఈ మొత్తం కాకుండా ఈ జట్లకు కూడా గ్రూప్ దశలో సాధించిన ఒక్కో విజయానికి రూ.32 లక్షలపైగా నగదు బహుమతి దక్కుతుంది.

మిగతా జట్లకు ఎంత?

మిగతా జట్లకు ఎంత?

సూపర్-12 దశకు చేరుకున్న ప్రతి జట్టుకు 70 వేల డాలర్లు (రూ.56 లక్షలపైగా) నగదు బహుమతి దక్కుతుంది. ఇవి కాక, పైన చెప్పినట్లు ఈ దశలో సాధించిన ఒక్కో విజయానికి రూ.32 లక్షలు అదనంగా ఇస్తారు. అంటే ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి జట్లు సాధించిన విజయాలకు అదనంగా ప్రైజ్ మనీ దక్కుతుందన్నమాట. సూపర్-12 దశలో ఒక్క విజయం కూడా లేకుండానే ఇంటి దారిపట్టిన ఆఫ్ఘనిస్తాన్‌కు కూడా రూ.56 లక్షల బహుమతి దక్కుతుంది. అంతకుముందు రౌండ్-1లో పాల్గొన్న జట్లకు రూ.32 లక్షలు అందిస్తారు. ఈ దశలో ఆయా జట్లు సాధించిన ఒక్కో విజయానికి కూడా ఇదే మొత్తాన్ని అందజేస్తారు.

Story first published: Saturday, November 12, 2022, 10:56 [IST]
Other articles published on Nov 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+