ఈ సంవత్సరాన్ని మనదిగా మార్చుకుందాం!: రాహుల్ బర్త్‌డే రోజు పాండ్యా ట్వీట్

హైదరాబాద్: 2019 ఆరంభంలో భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న వీరిద్దరూ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వీరి క్రికెట్ కెరీర్‌పైనే పెను ప్రభావాన్ని చూపించాయి. కాఫీ విత్ కరణ్ షో టాక్ షోలో వీరు చేసిన వ్యాఖ్యలకు గాను దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో పర్యటనలో ఉన్న వీరిద్దరిని స్వదేశానికి పిలిపించడంతో పాటు బీసీసీఐ సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే, ఈ నిషేధం పాండ్యా, రాహుల్ కెరీర్‌లను నాశనం చేస్తుందని బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) కూడా ఊహించలేకపోయింది. చివరకు వీరిద్దరిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడంతో జట్టులోకి పునరాగమనం చేశారు.

సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత
సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత సొంతగడ్డపై ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన సిరిస్‌లో కేఎల్ రాహుల్ ఇండియా-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్ గడ్డపై వన్డే, టీ20 సిరిస్ ఆడేందుకు పయనమయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనలో పాండ్యా అద్భుత ప్రదర్శన చేసి మళ్లీ ఫామ్‌ని అందుకున్నాడు.

నిషేధం ఎఫెక్ట్ ఏమో తెలియదు గానీ
నిషేధం ఎఫెక్ట్ ఏమో తెలియదు గానీ ఇద్దరూ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నారు. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 387 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే
టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో సైతం కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఈ జాబితాలో 450 పరుగులతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, కేఎల్ రాహుల్ పంజాబ్ తరఫున మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ముంబై విజయాల్లో కీలకపాత్ర
ఇక, హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తోన్న హార్ధిక్ పాండ్యా ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 186 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో పాండ్యా అత్యధిక స్కోరు 37 నాటౌట్. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ పాండ్యా జట్టుకు మంచి మ్యాచ్ ఫినిషర్‌గా మారాడు.
గురువారం కేఎల్ రాహుల్ పుట్టిన రోజు
ఇదిలా ఉంటే, గురువారం కేఎల్ రాహుల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పాండ్యా... కేఎల్ రాహుల్‌కు ఓ మెసేజ్ పంపాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో "జీవితంలో వీరిద్దరూ సోదరులు. ఏదేమైనా.. లవ్ యూ బ్రో.. ఈ సంవత్సరాన్ని మనదిగా మార్చుకుందాం" అని కామెంట్ పెడుతూ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో జత చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications