Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు దడపుట్టించు: కౌల్టర్ నైల్‌తో హాజల్‌ఉడ్

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో నవంబర్ 23 నుంచి స్వదేశంలో యాషెస్ సిరిస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లు మాటల యుద్ధానికి దిగుతున్నారు. తమ వాడివేడి మాటలతో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆసీస్ ఆటగాళ్లు.

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో ఇంగ్లాండ్ రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో ఆసీస్ ప్రధాన పేసర్ జోష్ హాజల్‌వుడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరిస్ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ టాపార్డర్‌కు మన బౌలింగ్ సత్తా చూపెట్టాలంటూ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్ కౌల్టర్ నైల్‌కు సూచించాడు.

Let's 'crack open' England batsmen: Hazlewood to Coulter-Nile

'కౌల్టర్ నైల్.. ఇంగ్లాండ్‌పై రెచ్చిపో. నీ పదునైన బంతులతో వారికి దడపుట్టించు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్‌‌కు అవకాశం ఇవ్వకు. తొలుత టాపార్డర్ పనిపట్టు. ఆ తర్వాత వారు తేరుకునే అవకాశం ఉండదు.
ఇంగ్లండ్ జట్టును బౌలింగ్‌తో భయభ్రాంతులకు గురి చేసి పైచేయి సాధించాలి. రెండు రోజుల మ్యాచ్‌లో కౌల్టర్ చేస్తాడని అనుకుంటున్నా' అని హాజల్‌ఉడ్ అన్నాడు.

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌తో కలిసి హజల్ ఉడ్ ఓపెనింగ్ బౌలింగ్‌ను పంచుకునే అవకాశం ఉంది. ఆ ఇద్దరికి జతగా మరో పేసర్ ప్యాట్ కమిన్స్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+