For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవిశాస్త్రికి కౌంటర్ ఇచ్చిన సీఓఏ, 'కోహ్లీ జాగ్రత్తగా ఉండు'

Virat Kohli's ‘Leave India’ Comment : BCCI Is Not Happy With The Statement | Oneindia Telugu
Let people judge if this is the best team in 15 years, CoA tells Ravi Shastri

హైదరాబాద్: అంతర్జాతీయంగా 15 ఏళ్లలో ఉత్తమ పర్యాటక జట్టు భారతేనని చెప్పే ప్రయత్నంలో రవిశాస్త్రికి చిక్కు వచ్చి పడింది. గతంలో చేసిన వ్యాఖ్యలకు పరిపాలన కమిటీ (సీవోఏ) గట్టి కౌంటర్ ఇచ్చింది. అత్యుత్తమ జట్టు ఏదో ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించింది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖులతో కూడిన సమావేశంలో ఇది చోటు చేసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపాడు.

 సొంత ఆటగాళ్లనే విమర్శ చేస్తోందంటూ

సొంత ఆటగాళ్లనే విమర్శ చేస్తోందంటూ

భారత మీడియా సొంత ఆటగాళ్లనే పదేపదే విమర్శలకు గురి చేస్తోందంటూ సమావేశంలో శాస్త్రి పరోక్షంగా బయటపెట్టాడు. ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓడిన తర్వాత మీడియాకు, కెప్టెన్ కోహ్లీకి మధ్య జరిగిన మాటల వాగ్వాదాన్ని సీవోఏ ముందుంచారు. దానికి స్పందించిన ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా.. ప్రదర్శన గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలంటూ కౌంటర్ ఇచ్చింది.

 ప్రపంచంలో అత్యుత్తమ జట్టుని ప్రజలే

ప్రపంచంలో అత్యుత్తమ జట్టుని ప్రజలే

సీవోఏ సభ్యుడు రవి వ్యాఖ్యలను మధ్యలోనే అడ్డుకుంటూ సమావేశం ఎజెండా, ఆస్ట్రేలియా టూర్ పాలసీలపై చర్చను కొనసాగించారు. ఓవరాల్‌గా ప్రపంచంలో అత్యుత్తమ జట్టుని ప్రజలు నిర్ణయిస్తారు.. మీరు కాదని ఘాటుగానే హెచ్చరించి వదలిపెట్టింది. అని సదరు అధికారి పేర్కొన్నారు. టీమిండియాకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందజేస్తున్నాం కాబట్టి మైదానంలో ప్రదర్శన అత్యుత్తమంగా ఉండాలని కోహ్లీ, శాస్త్రికి సీవోఏ సూచించిందని మరో అధికారి తెలిపారు.

రహానె సమావేశంలో మాట్లాడకుండానే

రహానె సమావేశంలో మాట్లాడకుండానే

అజింకా రహానె సమావేశంలో ఎక్కువగా మాట్లాడకుండానే ఉండిపోయాడని, ముంబై నుంచి వచ్చే క్రమంలో రోహిత్ శర్మ సమావేశానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చాడని చెప్పుకొచ్చాడు. వచ్చిన తర్వాత శర్మతో పాటుగా రోహిత్ కూడా మాట కలిపాడని తెలిపాడు. ఈ సమావేశంలో వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, సీఈఓ రాహుల్ జోహ్రీ, ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమీన్, (క్రికెట్ ఆపరేషన్)జనరల్ మేనేజర్ సబా కరీమ్, కోహ్లీ, రోహిత్, రహానె, సెలక్టర్ కమిటీ ఛీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్‌లు పాల్గొన్నారు.

అభిమానుల వల్లే కోహ్లీకి ఇంత డబ్బు

అభిమానుల వల్లే కోహ్లీకి ఇంత డబ్బు

నవంబరు 5న పుట్టినరోజు సందర్భంగా కోహ్లీ యాప్‌ను విడుదల చేశాడు. అందులో ఓ అభిమానిపై దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కామెంట్ చేయడంతో అది కాస్తా వివాదాస్పదమైంది. దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. 'కోహ్లీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అభిమానుల వల్లే అతను ఇంత డబ్బు సంపాదించుకోగలుగుతున్నాడు. కామెంట్ చేసే ముందు ఆలోచించి చేస్తే బాగుండేది' అని పేర్కొన్నాడు.

Story first published: Friday, November 9, 2018, 12:19 [IST]
Other articles published on Nov 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+