
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్‌గా పేరొందింది ఐపీఎల్. బీసీసీఐ నిర్వహిస్తోన్న ఈ దేశీవాలీ లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లను కొనుగోలు చేసి భారీ స్థాయిలో లీగ్‌ను విజయవంతం చేస్తోంది బీసీసీఐ. ఇలా విదేశీ క్రీడాకారులు వచ్చి మన దేశంలో జరిగే ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడు మన క్రికెటర్లు కూడా విదేశీ గడ్డలపై జరిగే లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తే బాగుంటుందని కోల్‌కతా నైడర్స్ సీఈవో అభిప్రాయపడ్డారు.
ఏటా భారత్‌లో జరిగే ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు ఆడుతుంటారు. కానీ, విదేశాల్లో నిర్వహించే లీగ్స్‌లో మన ఆటగాళ్లు కనిపించరు. అక్కడ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఐతే, భవిష్యత్తులో ఇతర దేశాల్లో జరిగే టీ20 లీగ్స్‌లో భారత ఆటగాళ్లు ఆడేందుకు అనుమతి ఇవ్వాలని అంటున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ఏటా ఐపీఎల్ జరిగే సమయంలో సుమారు 20 నుంచి 25 మంది ఆటగాళ్లు బెంచ్‌కే పరిమితమవుతున్నారు. టోర్నీ మొత్తం వేచి చూసినా కొందరికి అవకాశాలు రావడంలేదు. దీంతో ప్రతిభ గల ఆటగాళ్లకు అవకాశం దక్కకుండా పోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత ఆటగాళ్లు విదేశాల్లో నిర్వహించే టీ20 బ్లాస్ట్, బిగ్‌బాష్ లీగ్, కరేబియన్ ప్రిమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్ తదితరాల్లో ఆడే అవకాశం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల భారత క్రికెట్‌కు.. ఎంతో లాభం చేకూరుతుంది. ఆటగాళ్లకు నైపుణ్యం మరింత మెరుగుపడుతుంది' అని వెంకీ అన్నారు.
'ఇటీవల ఐసీసీ ప్రతి ఆటగాడు మూడు టీ20లీగ్స్‌లో ఆడేందుకు అనుమతి ఇచ్చింది. ఇక అలాంటప్పుడు బీసీసీఐకి ఇబ్బంది ఏముంది. విదేశీ గడ్డలపై ఆడిన అనుభవం ఆటగాళ్లకూ వస్తుంది. ఇది కచ్చితంగా భారత్‌కు కలిసొచ్చే అంశమే' అని వెంకీ తెలిపారు.