గొప్ప క్రికెటర్‌గా.. బేబీ సిట్టర్‌గా: సెహ్వాగ్ స్టార్ స్పోర్ట్స్ వీడియోపై పంత్


హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు కెప్టెన్ టిమ్ పైన్... భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం అప్పట్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో స్లెడ్జింగ్‌లో భాగంగా పంత్‌ను టిమ్ పైన్ మా పిల్లలను ఆడిస్తావా? అని కోరగా... పైన్ కోరికను పంత్ నిజం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టిమ్ పైన్ భార్య పంత్ బెస్ట్ బేబీ సిట్టర్ అంటూ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో కితాబిచ్చింది.

బేబి సిట్టర్ సోషల్ మీడియాలో వైరల్
ఆ తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ట్విట్టర్‌లో తన కూతురిని ఆడిస్తావా? అని పంత్‌ని అడగడంతో బేబి సిట్టర్ అనే పదం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. త్వరలో భారత్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో ఓ కమర్షియల్ యాడ్‌నే రూపోందించింది.

సెహ్వాగ్‌తో వీడియో రూపొందించిన స్టార్ స్పోర్ట్స్
ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా రూపొందించిన ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బేబిసిట్టర్ అనే పదం ఇంతలా పాపులర్ కావడానికి కారకుడైన రిషబ్ పంత్ ఈ వీడియోపై ట్విట్టర్‌లో స్పందించాడు.
రిషబ్ పంత్ స్పందన
"వీరూ పాజీ.. గొప్ప క్రికెటర్‌గా.. బేబీ సిట్టర్‌గా ఎలా ఉండాలో చూపించారు. స్పూర్తిదాయకమైన వీడియో" అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే తొలి టీ20తో ఈ సిరీస్ ఆరంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications