Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కివీస్ ఆటగాడి విధ్వంసం.. 6 బంతుల్లో 6 సిక్సులు (వీడియో)!!

Leo Carter Hits Six Sixes In An Over, Becomes 7th Batsman To Achieve Feat || Oneindia Telugu
Leo Carter hits six sixes in an over, becomes seventh batsman to achieve feat

క్రైస్ట్‌చర్చ్‌: టీ20 మ్యాచులంటేనే ఎన్నో రికార్డులు బద్దలవుతాయి. కొన్ని రికార్డులు బ్యాట్స్‌మెన్ ఖాతాలోకి వెళితే.. మరికొన్ని బౌలర్లు ఎగరేసుకుపోతారు. ఇంకొన్ని రికార్డులు జట్టు పేరిట నమోదవుతాయి. తాజాగా న్యూజిలాండ్‌లో జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 లీగ్‌లో మరో అరుదైన రికార్డు నమోదయింది. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్ లియో కార్టర్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు.

29 బంతుల్లో 70 పరుగులు

29 బంతుల్లో 70 పరుగులు

ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సూపర్ స్మాష్ టీ20 లీగ్‌ జరుగుతోంది. లీగ్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో నార్తరెన్ నైట్స్‌, కాంటర్‌బురే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కాంటర్‌బురే ఆటగాడు కార్టర్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 70 పరుగులు చేసాడు. కార్టర్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లోని ఆరు బంతులను సిక్సులుగా మలిచాడు. దీంతో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఏడవ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

6 బంతుల్లో 6 సిక్సులు

6 బంతుల్లో 6 సిక్సులు

నార్తరెన్ నైట్స్‌ విసిరిన 220 పరుగుల లక్ష్యాన్ని కాంటర్‌బురే చేదిస్తోంది. కాంటర్‌బురే విజయానికి చివరి 30 బంతుల్లో 64 పరుగులు కావాలి. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు స్పిన్నర్ అన్టన్ డేవిచ్ క్రీజులోకి వచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన కార్టర్.. డేవిచ్ వేసిన ఆరు బంతులను సిక్సులుగా మలిచాడు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. కార్టర్ విజృంభణతో.. సమీకరణం 24 బంతుల్లో 28 పరుగులుగా మారింది.

మక్కాంచి కీలక ఇన్నింగ్స్

మక్కాంచి కీలక ఇన్నింగ్స్

కార్టర్ జతగా కెప్టెన్ కోల్ మక్కాంచి (49 నాటౌట్) కూడా చెలరేగడంతో మరో ఏడు బంతులు ఉండగానే 222 పరుగులు చేసి కాంటర్‌బురే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ చాడ్ బోవ్స్ (57) కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నార్తరెన్ నైట్స్‌ జట్టులో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (74), డీన్ బ్రౌన్లీ (55)లు అర్ధ సెంచరీలు చేశారు. అయితే కార్టర్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదడంతో కార్టర్, బ్రౌన్లీ శ్రమ వృధా అయింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో గిబ్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో గిబ్స్

2007లో నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా) అంతర్జాతీయ క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు బాదేస్తే ఆమ్మో అనుకున్నాం. అదే సంవత్సరంలో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. ఆ తర్వాత రాస్ విట్లీ (2017), హజ్రతుల్లా జజాయ్ (2018) కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు బాదారు.

తొలిసారి గ్యారీ సోబర్స్

క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఆటగాళ్లు ఏడుగురు ఉన్నారు. 1968‌లో గ్యారీ సోబర్స్ తొలిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరు సిక్సర్లు నమోదు చేసాడు. ఆ తర్వాత 1985లో రవిశాస్త్రి కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత గిబ్స్, యువరాజ్‌, విట్లీ, హజ్రతుల్లాలు బాదారు. ఇప్పుడు ఈ జాబితాలో కార్టర్ చేరాడు.

Story first published: Sunday, January 5, 2020, 15:46 [IST]
Other articles published on Jan 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+