న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సర్లతో విరుచుకుపడిన సిమ్మన్స్‌.. 40 బంతుల్లో 91 పరుగులు!!

Lendl Simmons Slams Unbeaten 91 As West Indies beat Ireland To Level T20I Series

సెయింట్‌కిట్స్‌: స్టార్ ఓపెనర్ లెండిల్‌ సిమ్మన్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 11 వర్లలోనే కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 140 పరుగులు చేసింది. సిమ్మన్స్‌ (91 నాటౌట్‌; 40 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 సిక్సులు ఉండడం విశేషం. సిమ్మన్స్‌ 91 పరుగులు చేస్తే.. అందులో బౌండరీల ద్వారానే 80 పరుగులు రావడం మరో విశేషం.

ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాడు.. కీపర్‌గా రాహుల్‌ కొనసాగుతాడు: కోహ్లీప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాడు.. కీపర్‌గా రాహుల్‌ కొనసాగుతాడు: కోహ్లీ

మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 19.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (11) పెవిలియన్ చేరిన తర్వాత మరో ఓపెనర్ కెవిన్‌ ఒబ్రెయిన్‌ (36), కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్మి (28)లు పరుగులు చేసారు. ఈ జోడి మినహా బ్యాట్స్‌మన్‌ ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. విండీస్ బౌలర్లు చెలరేగడంతో ఐర్లాండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివరలో బారీ మెక్‌కార్తీ (18) పరుగులు చేయడంతో ఐర్లాండ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కీరోన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రేవోలు తలో మూడు వికెట్లు తీయగా.. రూథర్‌ఫర్డ్‌, రొమారియో షెపర్డ్‌లు చెరో వికెట్‌ తీశారు.

139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ వికెట్‌ మాత్రమే నష్టపోయి విజయం సాధించింది. ఓపెనర్ ఎవిన్‌ లూయిస్‌ (46; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించగా.. సిమ్మన్స్‌ (91 నాటౌట్‌) సిక్సర్ల మోత మోగించాడు. విండీస్ విజయానికి చేరువలో ఉండగా లూయిస్‌ పెవిలియన్ చేరాడు. నికోలస్ పూరన్ అండతో సిమ్మన్స్‌ ధాటిగా ఆడాడు. 11వ ఓవర్ చివరి బంతికి సిక్స్ బాదిన సిమ్మన్స్‌ తన జట్టుకు విజయాన్ని అందించాడు. సిమ్మన్స్‌ దాడికి విండీస్‌ 11 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది.

తాజా విజయంతో విండీస్ మూడు టీ20ల సిరీస్‌ను టైగా ముగిసింది. తొలి టీ20లో ఐర్లాండ్‌ విజయం సాధించగా.. రెండో టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. ఆదివారం జరిగిన చివరి టీ20లో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. సిమ్మన్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', పొలార్డ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి. గతేడాది చివరలో టీమిండియాతో ఆడిన టీ20 సిరీస్‌ను విండీస్ 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే.

Story first published: Monday, January 20, 2020, 13:24 [IST]
Other articles published on Jan 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X