హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు క్రికెట్ దూరమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్(తొమ్మిది నెలలు).. చాలా మంచివాళ్లని ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కోచ్ డారెన్ లీమన్ పేర్కొన్నాడు. అక్కడ ఓ స్థానిక రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లీమన్ మాట్లాడుతూ..'ఆ ముగ్గురు మంచి వ్యక్తులని..నిషేధం పూర్తైన తర్వాత తప్పకుండా తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడతారని ఆశిస్తున్నట్లు' తెలిపాడు.
ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆటగాళ్లను సిద్ధం చేసే నేషనల్ ఫర్మార్మెన్స్ స్క్వాడ్ (ఎన్పీఎస్)కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తో పాటు 9నెలల పాటు నిషేధం ఉన్న బాన్‌క్రాఫ్ట్ చాలా మంచివాళ్లని చెప్పాడు లీమన్.
మరోవైపు వారి గురించి ప్రతి రోజూ బాధపడుతున్నట్లు పేర్కొన్నాడు. 'నా విషయానికొస్తే ఆస్ట్రేలియన్ క్రికెట్ నాకు ఎంతో ప్రధానమైనది. నేను ఆశిస్తున్న ప్రకారం వాళ్లు జట్టుతో కలిసి సక్రమమైన ఆట ఆడి..తిరిగి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు గొప్ప గౌరవాన్ని తీసుకొస్తారని' ఈ మాజీ కోచ్ చెప్పాడు.
'గత ఆరు వారాలుగా నేనెంతో కఠినసమయాన్ని ఎదుర్కొంటున్నాను. ఇంకా వాళ్ల గురించే ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వారిని క్షమిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. స్టీవ్ స్మిత్ మళ్లీ ఆస్ట్రేలియా జట్టు సారథ్య బాధ్యతలు చేపడతాడని' లీమన్ అభిప్రాయపడ్డాడు.
నేషనల్ ఫర్మార్మెన్స్ స్క్వాడ్‌కు ట్రాయ్ కూలీ, ర్యాన్ హ్యారిస్, క్రిస్ రోజర్స్లతో కలిసి లీమన్ సేవలందించనున్నాడు.