దాదా అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టి గ్రౌండ్లో అడుగుపెడతానన్న గంగూలీ

భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. తాను లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఓ మ్యాచ్ ఆడబోతున్నట్లు ప్రకటించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్ 2లో తాను ఆడబోనని ఇటీవల వచ్చిన వార్తలను ఖండించిన గంగూలీ.. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం ఆడతానని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ భారతదేశంలో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో భాగంగా ఓ సోషల్ కాస్ కోసం గంగూలీ ఓ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇక దాదా అభిమానులు మరోసారి గంగూలీని గ్రౌండ్లో చూడబోతున్నారన్నమాట.

జిమ్‌లో చెమటోడ్చుతున్న గంగూలీ
ఇక ఈ మ్యాచ్ కోసం ఫిట్ నెస్ సాధించడానికి తాను జిమ్‌లో చెమటొడుస్తున్న చిత్రాలను దాదా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అతను తన పోస్ట్‌కి ఇలా క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 'ఆజాది కా మహత్సోవ్ కోసం లెజెండ్స్ లీగ్‌లో ఒక ఛారిటీ ఫండ్ రైజింగ్ మ్యాచ్ ఆడాలనుకుంటున్నాను. అందుకోసం శిక్షణ తీసుకుంటున్నాను. 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా ఈ ఫండ్ రైజింగ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మహిళా సాధికారతనుద్దేశించి కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ టీ20 మ్యాచ్‌లో టాప్ లెజెండరీ క్రికెటర్లతో తలపడాలి. ఎలాగైన మంచి క్రికెటింగ్ షాట్లు ఆడాలి.' అంటూ దాదా పోస్ట్ చేశాడు.

దాదా ఐకానిక్ షాట్ల కోసం వెయిటింగ్
లెజెండ్స్ లీగ్ క్రికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా గంగూలీ ఆడడం గురించి స్పందించాడు. 'ఇతర లెజెండ్‌లతో మ్యాచ్ ఆడడానికి సిద్ధమైన లెజెండరీ సౌరవ్ గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకప్పుటి లెజెండ్ ఎప్పుటికీ లెజెండే. దాదా ఎప్పుడూ క్రికెట్‌కు అండగా ఉంటాడు. అతను ఒక ప్రత్యేక సోషల్ కాజ్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇది మన ప్రేక్షకులకు అద్భుతమైన మ్యాచ్‌గా ఉండబోతుంది. కొన్ని ఐకానిక్ దాదా షాట్ల కోసం మేం ఎదురుచూస్తున్నాం. గంగూలీ ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. తిరిగి గంగూలీని మైదానంలో చూడటం అభిమానులకు చాలా ఉత్సాహంగా ఉంటుంది.' అని రామన్ రహేజా తెలిపాడు.

195 మ్యాచ్‌లకు భారత కెప్టెన్‌గా
గంగూలీ ఇప్పటివరకు 113టెస్టులు, 311 వన్డేలలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 18,575 పరుగులు చేశాడు. అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 195 మ్యాచ్‌లలో టీమిండియాకు కెప్టెన్సీ వహించాడు. అందులో 97 మ్యాచ్‌లను గెలిపించాడు. గంగూలీ 1996లో ఇంగ్లాండ్‌పై లార్డ్స్‌లో తన తొలి టెస్టులో సెంచరీ సాధించి తన టెస్టు అరంగేట్రం చేశాడు. రెండో టెస్టులో కూడా గంగూలీ సెంచరీ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications