
పీటర్సన్ జోరు
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వరల్డ్ జెయింట్స్‌కు ఓపెనర్లు పీటర్సన్, మస్తర్డ్ శుభారంభాన్ని అందించారు. పీటర్సన్ జోరు చూపించడంతో వీరిద్దరు తొలి వికెట్‌కు 51 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మస్తర్డ్ 7, కెవిన్ ఓ బ్రియాన్ 2 పరుగులకే వెంట వెంటనే ఔటయ్యారు. 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 22 బంతుల్లోనే 48 పరుగులు చేసిన పీటర్స్‌ను కూడా ఆ వెంటనే ఔటయ్యాడు. దీంతో వరల్డ్ జెయింట్స్ 65 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోరె అండర్సన్, హాడిన్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో 2 ఫోర్లు, 4 సిక్స్‌లుతో 16 బంతుల్లోనే 37 పరుగులు చేసిన హాడిన్ జట్టు స్కోర్ 119 పరుగుల వద్ద ఉండగా మురళీధరన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

అండర్సన్ విధ్వంసం
ఈ క్రమంలో కెప్టెన్ డారెన్ సామీతో కలిసి అండర్సన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వరుస బౌండరీలతో చెలరేగి ఆడిన వీరిద్దరు 33 బంతుల్లోనే 80 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 17 బంతుల్లోనే 38 పరుగులు చేసిన సామీ జట్టు స్కోర్ 199 పరుగుల వద్ద ఉండగా ఐదో వికెట్ రూపంలో ఔటయ్యాడు. అనంతరం అండర్సన్, మోర్కెల్ మరో వికెట్ పడకుండా ఆడి భారీగా పరుగులు రాబట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి వరల్డ్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కొరే అండర్సన్ 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 43 బంతుల్లోనే 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని విధ్వంసకర ఆట తీరుతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఎల్బీ మోర్కెల్ కూడా 8 బంతుల్లోనే 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆసియా లయన్స్ బౌలర్లలో కులశేఖర్ 3, మురళీధరన్, వాస్ తలో వికెట్ తీశారు.

లక్ష్యాన్ని చేరుకులేకపోయిన లయన్స్
అనంతరం 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్‌కు ఓపెనర్లు దిల్షాన్, జయసూర్య శుభారంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో 25 పరుగులు చేసిన దిల్షాన్, 38 పరుగులు చేసిన జయసూర్య స్వల్ప వ్యవధిలో వెనుదిరిగడంతో ఆసియా లయన్స్ 77 పరుగులకు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఉపుల్ తరంగ (25), ఆఫ్ఘాన్ (24), మహ్మద్ యూసూఫ్ (39*), మహ్మద్ రఫీ(22) కూడా మంచి స్కోర్లే చేసినప్పటికీ లక్ష్యం భారీగా ఉండడంతో జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ఆసియా లయన్స్ 8 వికెట్లు కోల్పోయి 231 పరుగులు మాత్రమే చేసింది. దీంతో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని ఎగురేసుకుపోయింది. వరల్డ్ జెయింట్స్ జట్టులో ఎల్బీ మోర్కెల్ 3, పనేసర్ 2, మోర్నీ మోర్కెల్, కెవిన్ పీటర్సన్, ర్యాన్ జే సైడ్‌బాటమ్ తలో వికెట్ తీశారు. కోరె అండర్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. మోర్నీ మోర్కెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.


Click it and Unblock the Notifications












