Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకప్పుడు టీమిండియా బౌలింగ్ వెన్నెముక.. ఇప్పుడు అర్ధంతరంగా కెరీర్ ముగింపు!

ధోనీ హయాంలో టీమిండియాకు కొత్త బంతితో అదిరే ఆరంభాలు ఇచ్చిన బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేవాడీ స్వింగ్ కింగ్. దీంతో జట్టులో చాలా కీలమైన ప్లేయర్‌గా ఎదిగాడు. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. ఇటీవలి కాలంలో జట్టుకు ఎంపికైంది లేదు. ఐపీఎల్‌లో కూడా పెద్దగా ఆడలేదు.

గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన భువీ ఈ టోర్నీలో కూడా అంత గొప్పగా రాణించలేదు. ముఖ్యంగా భారత్ ఓడిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అప్పటికి టెస్టు జట్టు నుంచి ఎప్పుడో దూరమైన భువీ.. వన్డే, టీ20ల్లోనే ఆడేవాడు. ఐపీఎల్‌లో బెస్ట్ డెత్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొని, భారత్ తరఫున కూడా ఇవే బాధ్యతలు నిర్వర్తించేవాడు.

Bhuvneshwar Kumar

అయితే గత టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో భారీగా మార్పులొచ్చాయి. సీనియర్లను పక్కన పెట్టేసిన సెలెక్టర్లు.. పొట్టి ఫార్మాట్‌లో కుర్రాళ్లకే ఓటేశారు. దీంతో భువీకి ఈ టీంలో చోటు దక్కలేదు. వన్డేల్లో కూడా పేస్ విభాగంలో ఖాళీ లేదు. దీంతో భువీ జట్టుకు దూరమయ్యాడు. ఇక మళ్లీ అతను టీంతో కలిసే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా భువీ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టా బయోను భువీ మార్చేశాడు. అంతకుముందు 'ఇండియన్ క్రికెటర్' అని భువీ ఇన్‌స్టా బయోలో ఉండేది. కానీ దాన్ని మార్చేసిన భువీ.. కేవలం 'ఇండియన్' అని మాత్రమే మార్చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అంటే భువీ తన చివరి టీమిండియా గేమ్ ఆడేసినట్లేనా? అని అంటున్నారు.

Bhuvneshwar Kumar

అయితే ట్విట్టర్‌లో భువీ బయో మారలేదు. అలాగే ఇటీవల రింకూ సింగ్‌తో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడీ వెటరన్ పేసర్. దీంతో భువీ కెరీర్ అప్పుడే ముగియలేదని, మళ్లీ జట్టులోకి పునరాగమనం చేస్తాడని మరికొందరు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా ఇలా ఇన్‌స్టా బయోలో మార్పులో భువీ చాలా మందికి పెద్ద షాకే ఇచ్చాడు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనే మళ్లీ భువీని యాక్షన్‌లో చూడగలుగుతాం.

Story first published: Saturday, July 29, 2023, 9:36 [IST]
Other articles published on Jul 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+