Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

86 సెంచరీలు.. 185 హాఫ్ సెంచరీలు.. లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

Wayne Larkins: ఇంగ్లీష్ లెజెండరీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ (71) చాలా కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. క్రీడా ప్రపంచంలో వేన్ లార్కిన్స్ నెడ్‌గా ప్రసిద్ధి చెందాడు. వేన్ లార్కిన్స్ 1953 నవంబర్ 22న .యూకేలోని రాక్‌స్టన్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన వేన్ లార్కిన్స్ 1979 నుంచి 1991 మధ్య కాలంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరఫున 13 టెస్టులు, 25 వన్డేలు ఆడాడు. టెస్టులలో 3 హాఫ్ సెంచరీలు, వన్డేలలో ఒక సెంచరీ చేశాడు.

వేన్ లార్కిన్స్ ఎన్ని పరుగులు చేశాడంటే?
వేన్ లార్కిన్స్ ఇంగ్లాండ్‌కు మాత్రమే కాకుండా దేశీయ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్, డర్హామ్, బెడ్‌ఫోర్డ్‌షైర్ జట్లకు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా కీలక పాత్ర పోషించాడు. దేశీయ క్రికెట్‌లో వేన్ లార్కిన్స్ మొత్తం 482 ఫస్ట్ క్లాస్, 485 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. అదే సమయంలో వేన్ లార్కిన్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 842 ఇన్నింగ్స్‌లలో వేన్ లార్కిన్స్ 34.44 సగటుతో 27, 142 పరుగులు పూర్తి చేశాడు. లిస్ట్ ఏలో 467 ఇన్నింగ్స్‌లలో 30.75 సగటుతో 13,594 పరుగులు సాధించాడు.

Legendary English Cricketer Wayne Larkins Passes Away at 71

85 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు
కాగా వేన్ లార్కిన్స్ ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 85 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు బాదాడు. వేన్ లార్కిన్స్ బ్యాటింగ్‌లో ఫస్ట్ క్లాస్‌లో 59 సెంచరీలు, 116 హాఫ్ సెంచరీ చేయగా.. లిస్ట్ ఏ క్రికెట్‌లో 26 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 40,736 పరుగులు సాధించారు. అటు బౌలింగ్‌లోనూ 119 వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.

Story first published: Sunday, June 29, 2025, 9:26 [IST]
Other articles published on Jun 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+