Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sachin Tendulkar:1000వ వ‌న్డే ప‌ట్ల గ‌ర్వ‌ప‌డాలి.. నా జీవితంలో టాప్ 5 అత్యుత్త‌మ వ‌న్డేలు అవే

Legendary Cricketer Sachin Tendulkar talks about 5 best ODI in his career
Sachin Tendulkar's 5 Best ODI's | Oneindia Telugu

ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌ర‌గ‌నున్న వన్డే మ్యాచ్ ద్వారా క్రికెట్‌లో 1000 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన తొలి జ‌ట్టుగా టీమిండియా చ‌రిత్ర సృష్టించ‌బోతుంది. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ స్పందించాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టీమిండియా 1000వ వ‌న్డే ప‌ట్ల త‌న అమూల్య‌మైన అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా తాను ఆడిన‌ వ‌న్డే మ్యాచ్‌ల గురించి గుర్తు చేసుకున్నాడు. కాగా టీమిండియా ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 999 వ‌న్డే మ్యాచ్‌ల్లో స‌చిన్ 463 మ్యాచ్‌లు ఆడ‌డం గ‌మ‌నార్హం.

వారిని గుర్తించాలి

వారిని గుర్తించాలి

టీమిండియా 1000 వ‌న్డే మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంటున్న నేప‌థ్యంలో దేశం మొత్తం గ‌ర్వ‌ప‌డాల‌ని భార‌త దిగ్గ‌జ క్రికెటర్ స‌చిన్ టెండూల్క‌ర్ అన్నారు. ఈ సంద‌ర్భంగా టీమిండియా త‌న తొలి వ‌న్డేను 1974లో ఆడిందని స‌చిన్ గుర్తు చేసుకున్నారు. అప్ప‌టి క్రికెట‌ర్లు, ప్ర‌స్తుత క్రికెట‌ర్లు, బీసీసీఐ స‌హ‌కారం వల్లే నేడు ఈ 1000 వ‌న్డేల మైలురాయి సాధ్య‌మైంద‌ని అన్నారు.

అలాగే మాజీ ఆట‌గాళ్లు, ప్ర‌స్తుత ఆట‌గాళ్ల‌ను గుర్తించాల‌ని చెప్పారు. వాళ్లంద‌రినీ గౌర‌వించాల‌ని సచిన్ తెలిపారు. టీమిండియా భ‌విష్య‌త్‌లో ఒక శ‌క్తిగా ఎదుగుతుంద‌ని ఈ సంద‌ర్భంగా స‌చిన్ ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. అలాగే ఆదివారం 1000వ వ‌న్డే మ్యాచ్ ఆడ‌బోతున్న భార‌త్ జ‌ట్టుకు స‌చిన్ టెండూల్క‌ర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే త‌న వ‌న్డే కెరీర్‌కు సంబంధించిన ఆస‌క్తిర విష‌యాల‌ని స‌చిన్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

దేశంలో వ‌న్డేలకు ఆద‌ర‌ణ అప్పుడే

దేశంలో వ‌న్డేలకు ఆద‌ర‌ణ అప్పుడే

"నా చిన్న‌త‌నంలో టీమిండియా తరపున టెస్టు క్రికెట్‌ ఆడాలని క‌ల క‌నే వాడిని. ఎప్పుడూ నా మెద‌డులో అదే ఉండేది. అప్పటికే దేశంలో వన్డే మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. కానీ నేను మాత్ర వన్డేల గురించి ఆలోచించే వాడిని కాదు. అంత‌కు ముందే భార‌త జ‌ట్టు 1983 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకుంది. కానీ అప్పుడే భార‌త్‌లో వ‌న్డేల‌కు ఆద‌రణ రాలేదు.

అయితే అనూహ్యంగా 1996 ప్రపంచకప్‌ నుంచి దేశంలో వన్డేలకు ఆదరణ పెరిగింది. దీంతో అప్పుడు వ‌న్డే క్రికెట్ ఆడుతున్న నేను ఆ ఫార్మాట్‌కు కొత్త రూపు వ‌చ్చిన క్ష‌ణాల‌ను ప్ర‌త్య‌క్షంగా అనుభ‌వించా" అని స‌చిన్ గుర్తు చేసుకున్నారు.

ఎన్నో మార్పులు చూశా

ఎన్నో మార్పులు చూశా

వన్డే ఫార్మాట్లో ఎన్నో మార్పులు చూశాన‌న్న స‌చిన్‌.. 1990వ సంవ‌త్స‌రంలో న్యూజిలాండ్‌లో ముక్కోణపు సిరీస్‌లో తొలిసారి తెల్లబంతితో మ్యాచ్ ఆడిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. 1991వ సంవ‌త్స‌రంలో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఎదుర్కొన్న ఓ ఇబ్బంది గురించి స‌చిన్ తెలిపారు. ఆ ప‌ర్య‌ట‌న‌లో వన్డేలు, టెస్టులు, ఆ తర్వాత ముక్కోణపు సిరీస్‌లో భాగంగా వన్డేలు ఆడాల్సి వచ్చింద‌ని చెప్పారు.

దీంతో తాను ఆ స‌మ‌యంలో బంతి రంగు కార‌ణంగా ఇబ్బంది ప‌డ్డాన‌ని ఆయ‌న తెలిపారు. వన్డేలు, టెస్టులు, ఆ తర్వాత ముక్కోణపు సిరీస్‌లో భాగంగా వన్డేలు ఆడాల్సి వచ్చినప్పుడు బంతి రంగు కారణంగా ఇబ్బంది పడ్డానని అతను గుర్తు చేసుకున్నాడు. అలాగే ఢిల్లీలోని జేఎల్‌ఎన్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో రంగు రంగుల జెర్సీ వేసుకుని తొలి డే అండ్ నైట్‌ వన్డే మ్యాచ్ ఆడాన‌ని ఆయ‌న తెలిపారు.

అప్ప‌ట్లో మ్యాచ్‌కు ఒకే బంతి వాడేవార‌ని, అది రివ‌ర్స్‌సింగ్ కూడా అయ్యేద‌ని చెప్పారు. కానీ ఇప్పుడు వ‌న్డే ఫార్మాట్లో రెండు బంతులు వాడుతున్నార‌ని, కొత్త బంతుల విధానంలో, ఫీల్డింగ్‌లో అనేక మార్పులు వ‌చ్చాయ‌ని అన్నారు.

5 అత్యుత్త‌మ వ‌న్డేలు అవే

5 అత్యుత్త‌మ వ‌న్డేలు అవే

ఇక‌ త‌న సుదీర్ఘ వ‌న్డే కెరీర్‌లో 5 అత్యుత్త‌మ వ‌న్డేలు ఎంచుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న‌ద‌ని స‌చిన్ తెలిపారు. అయితే త‌న కెరీర్‌లో 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌ ప్రత్యేకమైన‌ద‌ని, దానిని మిగ‌తా వాటితో క‌ల‌ప‌లేన‌ని అన్నారు. త‌న జీవితంలో అది గొప్ప రోజు అని, దానిని మాటల్లో చెప్ప‌లేన‌ని ఆయ‌న చెప్పారు.

2003 ప్ర‌పంచ‌క‌ప్ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో పాకిస్థాన్‌పై సాధించిన 98 ప‌రుగులు, మ‌రో ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న తండ్రి మ‌ర‌ణించిన స‌మ‌యంలో కెన్యాపై సాధించిన సెంచ‌రీ త‌న కెరీర్‌లో అత్యుత్త‌మ‌మైన‌వ‌ని స‌చిన్‌ తెలిపారు.

అలాగే షార్జాలో ఆస్ట్రేలియాపై చేసిన రెండు సెంచ‌రీలు, అత్యుత్త‌మ ద‌క్షిణాఫ్రికా బౌలింగ్‌ను ఎదుర్కొన సాధించిన డ‌బుల్‌సెంచ‌రీ ఇవ‌న్నీ త‌న వ‌న్డే కెరీర్‌లో 5 అత్యుత్త‌మ ఇన్నింగ్స్‌లుగా పేర్కొన‌వచ్చిన మాష్ట‌ర్ బ్లాష్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ వెల్ల‌డించారు.

Story first published: Saturday, February 5, 2022, 11:41 [IST]
Other articles published on Feb 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+