బీసీసీఐ, కోహ్లీ వివాదంపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, బీసీసీఐకి మధ్య రెండు మూడు రోజులుగా తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. బుధవారం ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. కాగా తాజాగా ఈ వివాదంపై టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ స్పందించాడు. ఈ వివాదంపై బీసీసీఐకి మద్దతుగా నిలుస్తూ విరాట్ కోహ్లీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వారికి ఆ హక్కు ఉంది
విరాట్ కోహ్లీని ప్రస్తుతం కెప్టెన్సీ వివాదాన్ని పక్కనపెట్టి దక్షిణాఫ్రికా పర్యటనపై దృష్టి పెట్టాలను సూచించాడు. దక్షిణాఫ్రికా టూర్ సమయంలో ఒకరిపై మరోకరు బహిరంగంగా వెలేత్తి చూపించుకోవడం తగదని, అది కోహ్లీకైనా, గంగూలీకైనా ఇంకెవరికైనా సరే మంచి పరిణామం కాదని కపిల్‌దేవ్ హెచ్చరించాడు. ఇక టీమిండియాకు కెప్టెన్‌ను నియమించే హక్కు సెలెక్టర్లకు ఉంటుందని చెప్పిన కపిల్ దేవ్.. ఈ విషయాన్ని వారు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఇది కేవలం కోహ్లీకి కాదని, ప్రతి ఒక్క ఆటగాడికి వర్తిస్తుందని ఆయన అన్నాడు.

నేడు దక్షిణాఫ్రికా వెళ్లిన టీమిండియా
కాగా దక్షిణాఫ్రికా పర్యటన కోసం టీమిండియా నేడు ఉదయానే అక్కడికి బయలు దేరింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు మూడు టెస్టు మ్యాచ్‌లతోపాటు, మూడు వన్డేలు కూడా ఆడనుంది. అయితే భారత జట్టు బయలు దేరే ముందే ఆటగాళ్లందరికీ మూడేసి సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగటివ్ వచ్చాకే విమానం ఎక్కించారు.
దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టాక భారత ఆటగాళ్లు అక్కడ ఒక రోజు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అక్కడ కూడా మూడేసి సార్లు భారత ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ వచ్చినవారికే మ్యాచ్ ఆడడానికి అవకాశం లభిస్తుంది. వారే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటారు. కాగా ఈ నెల 26 నుంచి సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది.

సౌతాఫ్రికా వెళ్లిన భారత జట్టు ఇదే
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్.
స్టాండ్‌బై ప్లేయర్స్: నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జన్ నాగ్వాస్వాల్లా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications