IPL 2023 : ఐపీఎల్‌కు మరో లెజెండ్ గుడ్ బై?.. మినీ వేలంలో లేని పేరు..!?
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు మరో లెజెండ్ వీడ్కోలు పలికాాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవలే విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ ఈ లీగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ముంబై ఇండియన్స్ అతన్ని రిలీజ్ చేసిన నేపథ్యంలో తను మరో జట్టుకు ఆడటాన్ని ఊహించుకోలేనని పొలార్డ్ చెప్పాడు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే వచ్చే ఏడాది నుంచి ముంబై జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పొలార్డ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

లిస్టులో లేని పేరు..?
ఇప్పుడు మరో విండీస్ దిగ్గజం ఈ లీగ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కూడా ఇకపై ఐపీఎల్‌లో కనిపించడట. వచ్చే ఏడాది లీగ్ కోసం ఈ నెల చివర్లో మినీవేలం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోచి వేదికగా జరిగే ఈ వేలం కోసం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో వెస్టిండీస్ నుంచి 33 మంది ప్లేయర్లు ఉన్నారు. వీళ్లెవరిలోనూ డ్వేన్ బ్రావో పేరు లేదని సమాచారం. దీంతో అతను కూడా ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలికేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్ ప్రయాణం
ముంబై ఇండియన్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డ్వేన్ బ్రావో.. ఆ తర్వాత 2011లో చెన్నైతో కలిశాడు. అప్పటి నుంచి చెన్నై తరఫున అద్భుతంగా రాణిస్తూ 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడాడు. తన కెరీర్‌లో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడిన బ్రావో.. 158 వికెట్లు పడగొట్టాడు. గతేడాది పది మ్యాచుల్లో 16 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా లసిత్ మలింగ రికార్డును బద్దలు కొట్టాడు.

చెన్నై నిర్ణయం..
మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేవలం 14 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా వాళ్లను వదిలేసింది. వీరిలో డ్వేన్ బ్రావోతోపాటు రాబిన్ ఊతప్ప, యువ సంచలనం జగదీశన్, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే తదితరులు ఉన్నారు. వీరిలో ఊతప్ప కొన్ని రోజుల క్రితమే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు బ్రావో కూడా ఇదే పని చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే అంబటి రాయుడుకు మాత్రం మరో సీజన్ అవకాశం ఇవ్వాలని చెన్నై నిర్ణయించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications