Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : రోహిత్‌ బ్యాటింగ్ చూసి నేర్చుకోండి.. ఆసీస్‌కు ఆ దేశ మాజీ లెజెండ్ సలహా!

Legend wants Aussies to learn from Rohit Sharma

భారత్‌తో టెస్టు సిరీసులో ఆస్ట్రేలియా ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రెండో టెస్టులో ఆసీస్ బ్యాటింగ్ కుప్పకూలడంపై ఆ దేశ మాజీలే మండిపడ్డారు. ఈ క్రమంలో మాథ్యూ హేడెన్ వంటి లెజెండరీ ఆటగాళ్లయితే పైసా తీసుకోకుండా జట్టుకు స్పిన్ ఎదుర్కోవడంలో సలహాలు ఇస్తామని, తమను ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలోకి తీసుకోవాలని కోరారు. ఇప్పుడు మరో లెజెండ్ మైకేల్ హస్సీ కూడా ఆసీస్ బ్యాటింగ్‌పై తన అభిప్రాయం వెల్లడించాడు.

రోహిత్ బ్యాటింగ్ సూపర్..

రోహిత్ బ్యాటింగ్ సూపర్..

ఆస్ట్రేలియా ఆటగాళ్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను చూసి బ్యాటింగ్ చేయడం నేర్చుకోవాలని హస్సీ సూచించాడు. 'కచ్చితంగా.. రోహిత్ శర్మ ఆటతీరు చూసి ఆస్ట్రేలియన్లు నేర్చుకోవాలి. అసలు అతను ఎలా ఆడుతున్నాడో చూడండి. తన ఆటతీరు అద్భుతంగా ఉంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై అతను స్పిన్‌ను ఎదుర్కొని పరుగులు చేసిన విధానం చాలా బాగుంది' అని మెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం స్పిన్‌ను ఎదుర్కోవడానికి స్వీప్ షాట్‌ను ఎంచుకొని బొక్కబోర్లా పడ్డారు. ఢిల్లీలో జరిగిన టెస్టులో స్వీప్, రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలోనే ఎక్కువ మంది ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టిన సంగతి తెలిసిందే.

 రోహిత్‌ను చూసి నేర్చుకోవాలి..

రోహిత్‌ను చూసి నేర్చుకోవాలి..

'ఇలాంటి పిచ్‌లపై ఆడుతూనే భారత బ్యాటర్లు పెరిగారు. కాబట్టి వీటిపై ఆడటం వాళ్లకు అలవాటనేది నిజమే. కానీ రోహిత్ ఆడినట్లు అచ్చుగుద్దినట్లు ఆడటం ఎవరి వల్లా కాదు. ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఉదాహరణకు హేడెన్ ఆడినట్లు ఆడటం నా వల్ల కాదు' అని హస్సీ వివరించాడు. కాబట్టి రోహిత్ ఆటతీరు చూసి ఆసీస్ ఆటగాళ్లు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు జట్టులో తమ పాత్ర ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలని, ఆ తర్వాత తమ సహజమైన ఆట ఆడాలని ఈ లెజెండ్ సలహా ఇచ్చాడు.

ఎవరి స్టైల్ వారిది..

ఎవరి స్టైల్ వారిది..

తమకు అలవాటు లేని షాట్లతో పరుగులు చేయడం కన్నా, అచ్చొచ్చిన షాట్లతో ఆడటం మేలని హస్సీ చెప్పాడు. 'ఒక్కో ఆటగాడు ఎంత బాగా పరుగులు చేయగలం అని ఆలోచించుకోవాలి. ప్రతి ఆటగాడికీ తన స్టైల్ ఉంటుంది. కాబట్టి కొందరు బౌండరీలు బాది ఎగ్రెసివ్‌గా ఆడితే, మరికొందరు యాంకర్ రోల్ పోషించాలి. ముఖ్యంగా తమ బలాలు ఏంటో గ్రహించి, అలాగే ఆడాలి. ఏ షాట్లు ఆడితే పరుగులు వస్తాయో ఆ షాట్లు ఆడటం మంచిది. అంతేకానీ, అందరూ ఒకే షాట్ ఆడటం వల్ల ఉపయోగం లేదు' అని పేర్కొన్నాడు. మరి మూడో టెస్టులో ఆసీస్ జట్టు ఏం చేస్తుందో చూడాలి.

Story first published: Friday, February 24, 2023, 21:33 [IST]
Other articles published on Feb 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+