
మాజీల అసహనం..
వెటరన్ దినేష్ కార్తీక్, మాథ్యూ హేడెన్ అయితే ఆసీస్ బ్యాటర్ల షాట్ సెలెక్షన్‌ను కూడా తప్పుబట్టారు. బంతి తక్కువ ఎత్తు వస్తున్న ఇలాంటి పిచ్‌లపై ప్రతి బంతిని స్వీప్ చేయడానికి చూడటం చాలా పెద్ద తప్పని డీకే అన్నాడు. హేడెన్ కూడా డీకేతో అంగీకరించాడు. అలాగే క్రీజులో నుంచి ముందుకొచ్చి ఆడటంపై కూడా పెదవి విరిచాడు. 'లైన్‌కు మరీ పక్కకు వెళ్లకూడదు. బంతి వస్తున్న లైన్ మీదకే ఆడాలి' అని సలహా ఇచ్చాడు. భారత్‌పై ఎదురు దాడి చేయాలని అనుకున్న ఆసీస్ ఆటగాళ్ల ఆటలో ఈ ప్రాబ్లం స్పష్టంగా కనిపించింది. అది చూసిన జడ్డూ వాళ్లను తన బుట్టలో వేసుకున్నాడు.

స్వీప్ షాట్ ఆడకూడదు..
ఈ క్రమంలో డీకే మాట్లాడుతూ.. 'ఒక బ్లూప్రింట్ ప్రకారం ఆడాలని ఆసీస్ అనుకుంటే. వాళ్లు ఇలాంటి పిచ్‌పై అంత ఎక్కువగా స్వీప్ షాట్ ఆడకుండా ఉంటే సరిపోయేది. ఎందుకంటే బంతి అంత ఎత్తు ఎగరడం లేదు' అన్నాడు. 'అవును, కచ్చితంగా ప్రతి బంతికీ స్వీప్ ఆడకూడదు. అది కచ్చితంగా మన పొదిలో ఉండాల్సిన షాట్. కానీ దాన్ని తెలివిగా వాడుకోవాలి. ఇక్కడ ఆస్ట్రేలియా కుప్పకూలిపోవడం కనిపిస్తోంది. ఎగ్రెసివ్ ఆట అనుకొని మరీ హద్దుమీరారు' అని విమర్శించాడు. ఖవాజా, అలెక్స్ క్యారీ వంటి ఆటగాళ్లు కూడా ఈ షాట్ మీదనే ఎక్కువగా ఆధార పడేందుకు ప్రయత్నించారు.

అలా ప్లాన్ చేస్తారా?
'కొంతమంది తమ డిఫెన్స్‌ను వాళ్లే నమ్మలేదు. భారీ షాట్లతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అలా చేయాలని డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్ వేసుకోవడం కరెక్ట్ కాదు. క్రీజులో దిగిన తర్వాత పరిస్థితిని అంచనా వేసుకొని, దానికి తగ్గట్లు ఆడాలి. బ్యాటింగ్ ప్లాన్ ఉండటం మంచిదే కానీ.. పరిస్థితికి తగ్గట్లు ఆటను మార్చుకుంటూ ఉండాలి కూడా. నిన్ననే ఈ రోజు ఏం చేయాలో నిర్ణయించుకుంటే ఇలాగే సమస్యలు వస్తాయి' అని డీకే విమర్శించాడు. ఈ మాటలు కరెక్ట్ అని హేడెన్ అన్నాడు. 'నూటికి నూరు శాతం అదే కరెక్ట్. మంచి వివరణ. ఇప్పుడు నీ ముందుకు వస్తున్న బంతికి.. అంతకుముందు డెలివరీకి, తర్వాత వచ్చే బంతికి సంబంధం లేదు. ఇక్కడ ఆ మూమెంట్‌ను బట్టి ఆడాలి' అని చెప్పాడు.


Click it and Unblock the Notifications
