Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : కోహ్లీ కన్నా అతని సెంచరీ సూపర్.. మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్!

సన్‌రైజర్స్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. అద్భుతమైన శతకంతో తన జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో కీలకమైన ముందడుగు వేసింది. అదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు.

వీళ్లిద్దరిలో అందరూ కూడా కోహ్లీ శతకాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం క్లాసెన్ సెంచరీనే సూపర్ అంటున్నాడు. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి రెండు జట్లలో ఒక్కొక్క ప్లేయర్ సెంచరీతో చెలరేగారు. ఇలా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా జరగలేదు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Virat Kohli

'అంత పాపులర్ అవని ఒపీనియన్ చెప్తున్నా వినండి.. కోహ్లీ, క్లాసెన్ ఇద్దరూ సెంచరీ చేసినా.. నా వరకు హెన్రిక్ సెంచరీ బెటర్. సరైన సహకారం కూడా లేని, సరిగా పనిచేయని ఒక టీంలో నువ్వు ఉన్నావు అనుకో.. అలాంటప్పుడు ఇంత అద్భుతమైన సెంచరీ చేయడం మాటలు కాదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న జట్టుకు ఆడుతూ కూడా క్లాసెన్ ఇరగదీశాడు' అని మెచ్చుకున్నాడు.

ఓవరాల్‌గా చూసుకున్నా కూడా క్లాసెన్ తన ఆటలో ప్రత్యర్థిపై బాగా ఎదురు దాడికి దిగాడని చెప్పొచ్చు. కొన్ని అద్భుతమైన షాట్లతో 200 పైగా స్ట్రైక్ రేటుతో క్లాసెన్ తన సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లను క్లాసెన్ ఎదుర్కొన్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చాలా మంది ఓవర్సీస్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడతారనే విషయం తెలిసిందే.

కానీ క్లాసెన్ మాత్రం స్పిన్ బౌలింగ్‌లోనే తన ప్రతాపం చూపించడం చాలా మంది నిపుణుల దృష్టిని ఆకర్షించింది. అలాగే రివర్స్ స్వీప్, స్వీప్ వంటి షాట్ల జోలికి కూడా క్లాసెన్ వెళ్లలేదు. క్లాసిక్ క్రికెట్ షాట్లతోపాటు తన బలాన్ని నమ్ముకొని భారీ షాట్లు ఆడటం అందరికీ నచ్చింది. ముఖ్యంగా భారత పిచ్‌లపై స్పిన్నర్లను ఇలా ఒక విదేశీ ప్లేయర్ ఎదుర్కోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

Virat Kohli

అందుకని కోహ్లీ సెంచరీని తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ అదరగొట్టాడు. క్రీజులో అడుగు పెట్టినప్పటి నుంచే సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. అలాగే ఐపీఎల్‌లో ఆరు సెంచరీలు సాధించిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. దీంతో కోహ్లీ శతకం కూడా సూపర్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Story first published: Friday, May 19, 2023, 18:17 [IST]
Other articles published on May 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+