Asia Cup 2023 : ఇండియాను తిట్టాడని.. పాక్ మాజీ క్రికెటర్‌కు దిమ్మతిరిగేలా ఇచ్చిన మాజీ లెజెండ్!

పాకిస్తాన్ క్రికెటర్లు ఎప్పుడూ భారత్‌పై పడి ఏడుస్తూనే ఉంటారు. ఇండియా ఏం చేసినా బీసీసీఐ ఇతరులపై బలప్రదర్శన చేస్తోందంటూ ఏడుస్తుంటారు. తాజాగా ఆసియా కప్ 2023 విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రెండు దేశాల మధ్య పరిస్థితులు బాగలేని కారణంగా భారత జట్టును పాకిస్తాన్‌కు పంపడం కుదరదని బీసీసీఐ చెప్పింది. ఇటీవలే పెషావర్‌లో బాంబు దాడి జరిగితే.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సహా ఇతర ఆటగాళ్లను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించిన సంగతి తెలిసిందే.

నోరు పారేసుకున్న మియాందాద్..
అదే టీమిండియా అక్కడకు వెళ్లినప్పుడు అలాంటి ఘటనే టీమిండియా బస చేసిన హోటల్ సమీపంలో జరిగితే? ఆ హోటల్‌కే ఏమైనా అయితే? ముఖ్యంగా అది భారత జట్టు అని తెలిసి దాడి చేసే టెర్రరిస్టులు అక్కడ చాలా మందే ఉన్నారు. అందుకే టీమిండియాను అక్కడకు పంపేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. దీనిపై పాక్ మాజీ దిగ్గజం జావెద్ మియాందాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నోటికొచ్చినట్లు మాట్లాడాడు.

చావనివ్వండి..
'భారత్ ఇక్కడకు రాకూడదని అనుకుంటే.. మనకేంటి? ఇదే విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. మన క్రికెట్ మనకే ఉంటుంది. వాళ్ల చావు వాళ్లను చావనివ్వండి. వాళ్లు నరకానికి పోతే మనకేంటి? (దే కెన్ గో టు హెల్) ఇలాంటి పరిస్థితులను కంట్రోల్ చేయడం ఐసీసీ పని. అది కూడా చెయ్యకపోతే ఇక ఐసీసీ ఎందుకు? అన్ని దేశాలకూ ఒకే రూల్స్ ఉండాలి కదా. ఇలాంటి దేశాలు రాకపోతే.. అవి ఎంత బలమైన దేశాలైనా సరే వాటిని ఐసీసీ నుంచి తొలగించాలి' అని చెప్పాడు.

నరకానికి వెళ్లం..
దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ స్పందించాడు. భారత్ నరకానికి పోయినా తమకు పట్టదని మియాందాద్ అనడం ప్రసాద్‌కు రుచించలేదు. అందుకే 'కానీ వాళ్లు నరకానికే వెళ్లం అంటున్నారు' (బట్ దే ఆర్ రిఫ్యూజింగ్ టు గో టు హెల్) అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వెంకటేష్ ప్రసాద్‌లో పాతకాలం పదును ఇంకా తగ్గలేదని మెచ్చుకుంటున్నారు. 'ఈ డైలాగ్ వెళ్లి మియాందాద్‌కు ఎక్కడో దిగింది' అంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా,

ఆస్ట్రేలియాపై కూడా..
అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ హేలీపై కూడా వెంకటేష్ ప్రసాద్ ఇలాగే స్పందించాడు. భారత్‌లో తొండాట ఆడతారని, సరైన పిచ్‌లు తయారు చేస్తే ఆస్ట్రేలియా గెలుస్తుందని హేలీ అన్నాడు. దీనిపై స్పందించిన ప్రసాద్.. అంటే ఇంతకుముందు ఆస్ట్రేలియాలో కూడా ఆ జట్టుకు సరిపోని పిచ్‌లు తయారు చేశారా? అని ప్రశ్నించాడు. గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. అందుకే ప్రసాద్ ఇలా కామెంట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications