Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ ఫీవర్: ఇక్కడ హెలికాప్టర్ షాట్ తినొచ్చు!

న్యూఢిల్లీ: మనదేశంలో ఇప్పుడు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఏ క్రికెట్ అభిమాని నోట విన్నా ప్రపంచ టీ20 టోర్నీ గురించే మాట్లాడుంటున్నారు. టీ-20 ప్రపంచ కప్ మనదేశంలో జరుగుతుండటంతో క్రికెట్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ మెగా టోర్నీకి ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ వ్యాపారస్తులు.

క్రికెట్‌ సీజన్‌లో వివిధ ఆఫర్లతో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ లాభాలు గడించడం సాధారణ విషయమే. అయితే, ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌ యాజమాన్యం ఇంకాస్త కొత్తగా ఆలోచించింది. ప్రముఖ 'హోటల్‌ ది లలిత'లోని ది 24/7 బార్‌.. తన మెనూను క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించింది. రెస్టారెంట్‌లోని ఆహార పదార్థాలకు క్రికెట్‌ షాట్ల పేరు పెట్టింది.

లెగ్‌ గ్లాన్స్‌, లేట్‌ కట్‌, హెలికాప్టర్‌ షాట్లను మెనూలో పొందుపరిచింది. నోరూరించే పుట్టగొడుగుల (మష్రూమ్‌) ఫ్రైకి టీమిండియా ధోనీ షాటైన.. హెలికాప్టర్‌ షాట్‌ పేరు పెట్టింది. ఇక వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా ఫేమస్‌ షాట్‌ 'లేట్‌ కట్‌' అని ఆర్డర్‌ చేస్తే.. వెజిటేబుల్‌ స్ప్రింగ్‌ రోల్‌ టేబుల్‌ పైకి వచ్చేస్తోంది.

Leg Glance to Helicopter Shot: Cricket-inspired food at this restaurant will bowl you over

మటన్‌ స్కేవెర్డ్‌కు సంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌ ఫేమస్‌ 'క్రిస్ప్‌ డ్రైవ్‌' పేరు పెట్టింది. మట్టి పాత్రలో తయారు చేసిన ఈ వంటకాన్ని తింటుంటే సచిన్‌ టెండూల్కర్‌ ట్రేడ్‌ మార్క్‌ స్ట్రయిట్‌ డ్రైవ్‌ను చూస్తున్న ఫీలింగ్‌ కలుగకమానదని నిర్వాహకులు చెబుతున్నారు.

అదే విధంగా టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రత్యేక తెరలను కూడా ఏర్పాటు చేసింది. మైదానంలో ఆటగాళ్లు కొట్టే షాట్లను చూస్తూనే తమకిష్టమైన షాట్ల(ఆహార పదార్థాల)ను పసందుగా ఆరగించేయచ్చన్నమాట. ఈ రెస్టారెంట్ వినూత్న ప్రయత్నాన్ని క్రికెట్ అభిమానులు కూడా బాగానే ఆదరిస్తుండటం గమనార్హం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+