క్రికెట్ ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు బౌలర్‌గా కొనసాగి 704 టెస్టు వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్.. చిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి ఉద్దండులను పక్కనపెట్టి తన ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్‌ను ఎంచుకున్నారు. అనేక తరాల భారతీయ బ్యాటర్లను ఎదుర్కొన్న జేమ్స్ ఆండర్సన్.. అందరికంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ తనను ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు.
కోహ్లీని ఎందుకు ఎంచుకున్నారంటే?
జేమ్స్ ఆండర్సన్ దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు బౌలింగ్ చేశారు. అయితే విరాట్ కోహ్లీతో సాగించిన పోరాటం అత్యంత చిరస్మరణీయమని ఆయన భావిస్తున్నారు. కోహ్లీ చూపించే దూకుడు, ఆటపై అతనికున్న నిబద్ధత ఆండర్సన్‌ను బాగా ఆకట్టుకున్నాయి. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీని ఆండర్సన్ నాలుగు సార్లు ఔట్ చేసి ముప్పతిప్పలు పెట్టారు. కానీ 2018లో కోహ్లీ తిరిగి పుంజుకుని ఆండర్సన్ బౌలింగ్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 593 పరుగులు సాధించి గట్టి సమాధానమిచ్చారు.

వివిధ దేశాల నుంచి ఆండర్సన్ ఫేవరెట్ ప్లేయర్లు వీరే..
టీఎన్‌టీ (TNT) స్పోర్ట్స్‌తో మాట్లాడిన సందర్భంగా.. ఆండర్సన్ ఇతర దేశాల నుంచి కూడా తన ఫేవరెట్ ఆటగాళ్లను ప్రకటించారు:
*భారత్-విరాట్ కోహ్లీ
*ఆస్ట్రేలియా-షేన్ వార్న్
*దక్షిణాఫ్రికా-ఏబీ డివిలియర్స్
*శ్రీలంక-సనత్ జయసూర్య
*పాకిస్థాన్-బాబర్ ఆజం
*న్యూజిలాండ్-టిమ్ సౌథీ
*ఇంగ్లాండ్ -జో రూట్
ఆండర్సన్ రికార్డుల ప్రస్థానం:
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు(704) తీసిన పేసర్‌గా ఆండర్సన్ రికార్డు సృష్టించారు. 2003లో అరంగేట్రం చేసిన ఆయన 21 ఏళ్ల పాటు రెడ్ బాల్ క్రికెట్‌లో కొనసాగారు. 194 వన్డేల్లో 269 వికెట్లు పడగొట్టారు.