For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: మది నిండా నిరాశతో.. ఆస్ట్రేలియా వీడుతున్నాం: కోహ్లీ

 leaving Australia with heart full of disappointment posts Virat Kohli

టోర్నీ మొత్తం అదరగొట్టి, చిట్టచివర్లో బొక్కబోర్లా పడటం టీమిండియాకు తెగ అలవాటైంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అదే తన అలవాటుగా మార్చుకున్న భారత జట్టు.. ఈ సారి కూడా అదే ఆచారాన్ని కొనసాగించింది. టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో అదరగొట్టి, అత్యధిక విజయాలతో సెమీఫైనల్ చేరింది. కానీ అక్కడ బోల్తా కొట్టింది.

సెమీస్‌లో చెత్త ప్రదర్శన

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్.. అరివీర భయంకరులని చెప్పుకునే ఓపెనర్లు.. పవర్‌ప్లేలో విరుచుకుపడాలనే కొత్త టెంప్లేట్.. ఇవేమీ ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత్‌కు కలిసి రాలేదు. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నా ఆటగాళ్లు పరుగులు చెయ్యలేకపోయారు. టోర్నీ మొత్తం ఫ్యాన్స్‌ను ఏడిపించిన ఓపెనర్లు మరోసారి అదే ఫామ్ కంటిన్యూ చేసి చెత్తగానే ఆడారు. సూర్యకుమార్ కూడా అవుటవడంతో ఇక ఓటమి ఖరారైంది. చివర్లో కోహ్లీ, పాండ్యా ఆదుకునేందుకు ప్రయత్నించినా.. అప్పటికే మ్యాచ్ చేతులు జారిపోయింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్లు ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించి భారత జట్టుకు ఎలా ఆడాలో నేర్పించారు.

మొత్తం టోర్నీలో ఆ ఇద్దరే..

ఈ ఓటమితో ఎలాగైనా జట్టుకు ప్రపంచకప్ అందించాలన్ని విరాట్ కోహ్లీ కోరిక మరోసారి ఎండమావిగానే మిగిలింది. ఈ టోర్నీలో కోహ్లీ అద్భుతంగా రాణించినా.. మిగతా బ్యాటర్లలో ఒక్క సూర్యకుమార్ తప్ప మిగతా ఎవరి నుంచి అతనికి కనీస సహకారం కూడా అందలేదు. కోహ్లీ ఈ టోర్నీలో ఆరు ఇన్నింగ్సుల్లో 296 పరుగులు చేయగా.. సూర్యకుమార్ 239 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. అన్ని మ్యాచుల్లో ఆడిన రోహిత్, రాహుల్ ఇద్దరూ అత్యంత చెత్తగా ఆడారు. అసలు వీళ్లిద్దరూ చెత్తగా ఆడటం వల్లనే భారత్ ఓడిపోయిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మనసులో నిరాశతో..

మనసులో నిరాశతో..

సెమీస్‌లో నిష్క్రమించిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన కోహ్లీ.. 'కలను నిజం చేసుకోవడానికి అడుగు దూరంలో.. నిరాశతో నిండిన మనసుతో ఆస్ట్రేలియా గడ్డను వీడుతున్నాం. అయితే ఒక జట్టుగా మాకు ఈ టోర్నీ మధురానుభూతులను పంచింది. వీటితో మరింత మెరుగవడానికి ప్రయత్నిస్తాం. జట్టుపై అభిమానంతో స్టేడియానికి వచ్చి మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. ఈ జెర్సీ వేసుకొని, దేశానికి ఆడుతున్నందుకు ఎప్పుడూ గర్విస్తా' అని పోస్టు చేశాడు.

Story first published: Friday, November 11, 2022, 16:50 [IST]
Other articles published on Nov 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+