
నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో రెండో సెంచరీ చేసి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని 'బ్యాటింగ్ మాస్టర్'గా పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ అభివర్ణించాడు. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చూస్తూ తాను చాలా నేర్చుకున్నానని పాక్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.
తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి ఫకార్ జమాన్ మాట్లాడుతూ 'విరాట్ కోహ్లి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కష్టపడటం ద్వారా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనడానికి అతనే ఉదాహరణ. అందరిలానే కోహ్లి బ్యాటింగ్‌ను నేను కూడా ఆస్వాదిస్తాను.. అతని ఆటని చూడటం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. కోహ్లీ ఓ బ్యాటింగ్ మాస్టర్' అని కితాబిచ్చాడు.

ఇంగ్లాండ్‌తో నాటింగ్ హామ్ వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లో 97, 103 పరుగులు చేసి భారత్ విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అంతేకాదు కోహ్లీ తన తొలి టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్ కలిపి 200(149, 51 పరుగులు) పూర్తి చేశాడు. అయితే తొలి టెస్టులో 200స్కోరుకు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని చేరుకున్న కోహ్లీ.. రెండో టెస్టులో చేజార్చుకున్నా.. మూడో టెస్టులో పదిలం చేసుకున్నాడు.
ఏడాది క్రితం టెస్టుల్లోకి అరంగ్రేటం చేసిన జమాన్.. 18 వన్డేలు ఆడాడు. వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్ టోర్నమెంట్‌లో టీమిండియాతో పోరాడే జట్టులో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పాకిస్థాన్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఇటీవల రికార్డు నెలకొల్పిన ఫకార్ జమాన్.. గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ బాది భారత్‌ను పాక్ ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.