న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'చేధనలో ధోనీని చూసి ఎంతో నేర్చుకున్నా'

MS Dhoni Is Amazing, I Learnt A Lot Watching Him During Run Chases,Says Vijay Shankar | Oneindia
Learnt a lot watching Dhoni during run chases, says Vijay Shankar

హైదరాబాద్: ఛేజింగ్‌లో దూకుడుగా ఎలా ఆడాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకున్నానని భారత యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ అన్నాడు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో విజయ్ శంకర్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ సిరిస్ తనకో పాఠమని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు.

వరల్డ్‌కప్ జట్టులో ఆ ముగ్గురు?: స్పష్టం చేసిన చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కేవరల్డ్‌కప్ జట్టులో ఆ ముగ్గురు?: స్పష్టం చేసిన చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే

పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో విజయ్ శంకర్ మాట్లాడుతూ "నా చుట్టూ చాలామంది సీనియర్లుండటం కలిసొచ్చింది. వాళ్లను చూస్తూ, నేర్చుకుంటూ మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యాను. ఛేదనల్లో ధోనిని చూసి చాలా నేర్చుకున్నా. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలి, ఎలా వేగం పెంచాలి, ఎలాంటి దృక్పథంతో ఉండాలన్నది తెలుసుకున్నా" అని అన్నాడు.

సిరీస్‌లో బాగానే ఆడినప్పటికీ

సిరీస్‌లో బాగానే ఆడినప్పటికీ

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తనను మూడో స్థానంలో ఆడించడం ఆశ్చర్యంతో కూడిన సంతోషాన్ని కలిగించిందని శంకర్ చెప్పాడు. సిరీస్‌లో బాగానే ఆడినప్పటికీ.. ఇంకా ఎక్కువ పరుగులు చేయకపోవడం, మూడో టీ20లో జట్టును గెలిపించలేకపోవడం నిరాశ కలిగించిందని తెలిపాడు. రాబోయే రోజుల్లో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వెల్లడించాడు.

రెండు, మూడు మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో

రెండు, మూడు మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో

న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో రెండు, మూడు మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో(ఫస్ట్‌డౌన్‌) బ్యాటింగ్‌కు దిగిన విజయ్ శంకర్ అభిమానులను అలరించాడు. హామిల్టన్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో విజయ్‌ శంకర్‌ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు.

వరల్డ్ కప్ జట్టులో విజయ్‌ శంకర్‌ కూడా

వరల్డ్ కప్ జట్టులో విజయ్‌ శంకర్‌ కూడా

దీంతో వరల్డ్ కప్ జట్టులో విజయ్‌ శంకర్‌ కూడా తన ప్రణాళికల్లో ఉన్నాడంటూ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. ఏప్రిల్ 23లోపు భారత జట్టుని ప్రకటించాల్సి ఉండటంతో సెలక్టర్లు ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఒకటి, రెండు స్థానాలు తప్ప ఇప్పటికే దాదాపు అన్ని బెర్తులు ఖరారయ్యాయని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, February 13, 2019, 10:34 [IST]
Other articles published on Feb 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X