For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ బ్యాటింగ్, కీపింగ్ అద్భుతం.. అతనిలా మ్యాచ్‌లు ముగించాలనుకుంటున్నా

'MS Dhoni Batting And Keeping Awesome' Says N Jagadeesan || Oneindia Telugu
Learnt how to deal with pressure in cricket from CSK Players says TNPL cricketer N Jagadeesan

చెన్నై: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్, కీపింగ్ అద్భుతం. ధోనీలా మ్యాచ్‌లు ముగించాలనుకుంటున్నా అని తమిళనాడు క్రికెటర్‌ ఎన్‌ జగదీశన్‌ పేర్కొన్నాడు. జగదీశన్‌ ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ కెప్టెన్‌గా ఉన్న దిండిగల్‌ డ్రాగన్స్‌ తరఫున ఆడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్‌లో జగదీశన్‌ ఇప్పటికే 235 పరుగులు చేశాడు.

తాజాగా జగదీశన్‌ మీడియాతో మాట్లాడుతూ... 'చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది. ధోనీ, హస్సీ, రైనా వంటి అనుభవమున్న ఆటగాళ్లు ఉన్నారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. చెన్నై జట్టు సభ్యునిగా కొనసాగడంతో.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలగడం నేర్చుకున్నా. జట్టులో అందరికీ ఎంతో అనుభవం ఉంది. అదే నాకు ఉపయోగపడుతోంది' అని జగదీశన్‌ తెలిపాడు.

'ధోనీ బ్యాటింగ్, కీపింగ్ అద్భుతం. బంతిని బలంగా బాదుతాడు. మెరుపు స్టంపింగ్‌లు చేస్తాడు. ధోనీలా కీపింగ్‌లో చురుగ్గా కావాలనుకుంటున్నా. అతనిలా మ్యాచ్‌లు ముగించాలని భావిస్తున్నా. అశ్విన్‌ యువకులను బాగా ప్రోత్సహిస్తాడు. అతను కెప్టెన్‌గా ఉండటం జట్టుకు ఎంతో లాభం. ఒత్తిడిలో కూడా అండగా ఉంటాడు. విలువైన సలహాలు ఇస్తాడు' అని జగదీశన్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, August 1, 2019, 16:45 [IST]
Other articles published on Aug 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+