
హైదరాబాద్: టెస్టు క్రికెట్‌లో రాణించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని విరాట్ కోహ్లీ అన్నాడు. గత కొద్ది నెలలుగా అద్భుతమైన ఫామ్‌తో రికార్డుల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో కోహ్లీ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు(6) చేసిన ఆటగాడి కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తద్వారా వెస్టిండిస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా పేరిట ఉన్న ఐదు సెంచరీల రికార్డుని కోహ్లీ అధిగమించిన సంగతి తెలిసిందే. చివరి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన అనంతరం కోహ్లీ బీసీసీఐకి ఇంటర్యూ ఇచ్చాడు.
టెస్టు క్రికెట్‌లో క్రీజులో ఎక్కువసేపు ఉండి భారీ ఇన్నింగ్స్‌లు ఆడటం తన తోటి ఆటగాడు ఛటేశ్వర పుజారా నుంచి నేర్చుకున్నాని అందులో పుజారా చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పుజారా అడిగిన చాలా ప్రశ్నలకు కోహ్లీ సమాధానాలు చెప్పాడు. తాను భారీ సెంచరీలు సాధించడానికి పుజారా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లే స్ఫూర్తి అని వెల్లడించాడు.
'ఆరు డబుల్ సెంచరీలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. నేనెప్పుడూ భారీ సెంచరీలు సాధించాలనే చూస్తుంటాను. ఎందుకంటే నీ (పుజారా) బ్యాటింగ్‌ను చాలా కాలం నుంచి పరిశీలిస్తున్నాను. నీలా సుధీర్ఘ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో తెలుసుకున్నాను' అని కోహ్లీ తెలిపాడు.
'ఇతని(పుజారా) నుంచి సుధీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదల, ఏకాగ్రత వంటి విషయాలను మేం నేర్చుకున్నాం. అందుకే ఆ స్ఫూర్తితోనే జట్టు కోసం వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలని, సుధీర్ఘ ఇన్నింగ్స్ ఆడటానికి ప్రయత్నిస్తున్నా' అని కోహ్లి చెప్పాడు. దీంతో ఇది తనకు పెద్ద కాంప్లిమెంట్' అని పుజారా బదులివ్వడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.