కోహ్లీ.. బౌలింగ్ ఇవ్వడానికి భయడ్డాడు: హార్దిక్ పాండ్యా

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రితో ముగిసిన టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో పాండ్యా అద్భుతమైన ఆల్‌రౌండర్ ప్రదర్శన చేశాడు. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ రాణించి టీమిండియా విజయంలో ప్రధాన ప్రాత్ర వహించాడు. ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్లో పాండ్యా బౌలింగ్ కు వచ్చాడు. అదే అతనికి మొదటి ఓవర్. కాస్త తటపటాయిస్తూ.. అటుఇటుగా ఆడటంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఒకే ఓవర్లో 22 పరుగులు చేశారు. దీంతో పట్టుదలగా ఆడి చక్కగా రాణించాడు.

బౌలింగ్‌లో 4/38, బ్యాటింగ్‌లో 33/14:
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా బౌలింగ్‌లో ఉండగా పాండ్యా బంతితో 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు హార్దిక్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్సులు సాయంతో అజేయంగా 33 పరుగులు చేశాడు. దీంతో.. మ్యాచ్‌లో అలవోక విజయాన్ని అందుకున్న భారత్ మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది.

జాసన్ రాయ్ చెలరేగడంతో పాండ్య ఏకంగా 22 పరుగులు:
మ్యాచ్‌లో పాండ్యా వేసిన తొలి ఓవర్ అయిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ చెలరేగడంతో హార్దిక్ పాండ్య ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్ని రాయ్ 4, 4, 6, 6గా మలిచేశాడు. ఆఖరి రెండు బంతులకీ రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో.. మళ్లీ 12వ ఓవర్ వరకూ హార్దిక్ చేతికి కోహ్లి బౌలింగ్ కోసం బంతినిచ్చే సాహసం చేయలేదు. కానీ.. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో మళ్లీ అవకాశం దక్కగానే.. హార్దిక్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి లయ అందుకున్నాడు.

198/9కే పరిమితమైన ఇంగ్లాండ్
ఆ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్ అనంతరం 14వ ఓవర్‌లో 8 పరుగులిచ్చి ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హేల్స్ వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 18వ ఓవర్‌లోనూ 6 పరుగులు మాత్రమే ఇచ్చి బెన్‌స్టోక్స్, జానీ బారిస్టోని పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో.. ఒకానొక దశలో 225-230 పరుగులు చేసేలా కనిపించిన ఇంగ్లాండ్ 198/9కే పరిమితమైంది.

ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటా
‘మ్యాచ్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే 22 పరుగులిచ్చాను. దీంతో.. మళ్లీ బౌలింగ్ అవకాశం రాగానే.. అత్యుత్తమంగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఆ ఓవర్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి పరామర్శ ధోరణిలో వచ్చాడు. నేను ఏం ఫర్వాలేదు అని చెప్పా. ఇలాంటి పిచ్‌లపై వికెట్లు తీయడం మొదలుపెడితే.. ఆటోమేటిక్‌గా పరుగుల ప్రవాహం తగ్గుతుందని తెలుసు. అందుకే ఆ ప్లాన్‌తో ముందుకెళ్లా. ఇంగ్లాండ్ పర్యటనలో ముగిసిన టీ20 సిరీస్ వన్డే సిరీస్‌కు మంచి ప్రోత్పాహాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటా. ' అని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications