Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జహీర్ నుంచి ట్రిక్స్: మూడో టెస్టుకు బ్రాడ్ దూరం

విశాఖపట్నం: ఉప ఖండంలోని పిచ్‌లపై ఏవిధంగా బౌలింగ్ చేయాలో అనే దానిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పష్టం చేశాడు. నాలుగేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చినప్పుడు జహీర్‌ను అడిగి కొన్ని ట్రిక్స్ నేర్చుకున్నట్లు బ్రాడ్ పేర్కొన్నాడు.

'ఇప్పటికీ నాకు గుర్తుంది. నాలుగేళ్ల క్రితం భారత్ పర్యటనలో జహీర్ నుంచి కొన్ని బౌలింగ్ పాఠాలు నేర్చుకున్నా. ప్రధానంగా భారత తరహా పిచ్‌లపై బౌలింగ్ ఎలా చేస్తే ఫలితాన్ని సాధిస్తాం అనే దానిపై జహీర్‌ను అడిగి తెలుసుకున్నా. మనం ఇన్ స్వింగర్ వేసేటప్పుడు ఏయే పద్ధతులు ఇక్కడ అవలంభించాలని జహీర్‌ను అడిగాం' అని బ్రాడ్ పేర్కొన్నాడు.

'నాతో పాటు అండర్సన్ (జిమ్మీ) కూడా జహీర్ నుంచి ట్రిక్స్ తెలుసుకున్నాడు. బ్యాట్స్‌మన్ ఊరించే విధంగా స్లో బంతిని సంధించి, అదే క్రమంలో ఇన్ స్వింగ్ రాబట్టడం గురించి జహీర్ నుంచి ట్రిక్స్ తెలుసుకున్నాం. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పూజారాను అండర్సన్ ఇదే తరహాలో ఔట్ చేశాడు' అని బ్రాడ్ అన్నాడు.

Learned bowling tricks in sub continent pitches from Zaheer Khan: Stuart Broad

మూడో టెస్టుకు బ్రాడ్ దూరం
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా నవంబర్ 26 నుంచి మొహాలిలో జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ దూరం కానున్నాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఆదివారం బౌలింగ్‌ చేస్తుండగా గాయపడడమే ఇందుకు కారణం. గాయం నుంచి కోలుకొనేందుకు తనకు కొంత సమయం కావాలని బ్రాడ్‌ కోరడంతో విశ్రాంతి ఇవ్వాలని ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

రెండో టెస్టులో భాగంగా ఆదివారం తొలి సెషన్‌ రెండో ఓవర్‌ వేస్తుండగా బంతి కోసం డైవ్‌ చేశాడు. అప్పుడు బ్రాడ్‌ కుడికాలు బొటనవేలు బెణికింది. ముంబైలో జరిగే నాలుగో టెస్ట్‌ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించగలనని ఆశిస్తున్నానని బ్రాడ్‌ ఈ సందర్భంగా తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+