For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉప్పల్‌ స్టేడియంలో వాస్తుదోషం!: ఆ గుడి కట్టాక మారిన ఆతిథ్య జట్టు తలరాత!

India vs West Indies 2018 : The Temple Inside Uppal Stadium That Changed Team India's Fortune
Leap of Faith: The temple inside Uppal stadium that changed Team Indias fortune

హైదరాబాద్: ఉప్పల్‌ స్టేడియంలో వాస్తుదోషం ఉంది. అదేంటి ఇళ్లకు కదా వాస్తుదోషం ఉండేది... స్టేడియాలకు కూడా వాస్తుదోషం ఉంటుందా? అని మీరు అనుకోవచ్చు. నిజానికి మనం ఏ పని చేస్తున్నప్పటికీ కలిసిరాక పోవడం... ఎంత కష్టపడ్డా ఫలితం ఉండకపోవడం... ఇలాంటివన్నీ పదేపదే జరుగుతుంటే నివాసం ఉంటున్న ఇంటిలో వాస్తు దోషం ఏమైనా ఉందా అని? ఆలోచిస్తారు.

అదేవిధంగా ఉప్పల్‌ స్టేడియంలో ఆడిన ప్రతి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవుతుంటే దానికీ వాస్తు దోషమే కారణమా? అంటే అవునని అంటున్నాడు ఓ పూజారి. ఉప్పల్‌ స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఓ విఘ్నేశ్వరుడి గుడి కనిపిస్తుంది. అయితే, ఈ గుడిని అక్కడ నిర్మించడం వెనుక పెద్ద కథే ఉంది. ఉప్పల్‌ స్టేడియంలో వాస్తుదోషాన్ని తొలగించడానికి ఈ ఆలయాన్ని నిర్మించారు.

 2005లో స్టేడియం ప్రారంభమైనప్పుడు ఈ ఆలయం లేదు

2005లో స్టేడియం ప్రారంభమైనప్పుడు ఈ ఆలయం లేదు

మామూలు రోజుల్లో అంత సందడి ఉండదు కానీ మ్యాచులు జరిగే రోజుల్లో ఈ గుడి భక్తులతో కళకళలాడుతుంది. 2005లో స్టేడియం ప్రారంభమైనప్పుడు ఈ ఆలయం లేదు. కానీ ఈ మైదానంలో భారత జట్టుతోపాటు ఐపీఎల్‌ గత ఫ్రాంచైజీ డెక్కన్‌ చార్జర్స్‌కు అసలు విజయాలే దక్కకపోవడంతో.. స్టేడియంలో వాస్తుదోషం ఉందేమోనన్న అనుమానాలు వచ్చాయి.

తొలిసారి దక్షిణాఫ్రికాతో తలపడిన టీమిండియా 5 వికెట్లతో ఓటమి

తొలిసారి దక్షిణాఫ్రికాతో తలపడిన టీమిండియా 5 వికెట్లతో ఓటమి

2005లో స్టేడియంలో తొలిసారి దక్షిణాఫ్రికాతో తలపడిన టీమిండియా 5 వికెట్లతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2007, 2009లలో ఆస్ట్రేలియా చేతిలోనూ టీమిండియా ఓడిపోయింది. దాంతో వాస్తుదోషం ఉం దన్న అనుమానంతో వినాయకుడి ఆలయం నిర్మించారు. ఈ ఆలయం నిర్మించిన తర్వాత టీమిండియా ఆడిన ఓ మ్యాచ్‌లోనూ ఓడిపోక పోవడం విశేషం.

హనుమంతు శర్మ మాట్లాడుతూ

హనుమంతు శర్మ మాట్లాడుతూ

ఈ ఆలయంలో పూజారిగా పనిచేస్తోన్న హనుమంతు శర్మ మాట్లాడుతూ "ఈ వినాయకుడి మందిరాన్ని 2011లో నిర్మించారు. భారత జట్టు, ఐపీఎల్‌లో ఒకప్పటి డెక్కన్‌ ఛార్జర్స్‌ ఈ మైదానంలో నిర్వహించే మ్యాచుల్లో విజయం సాధించాలన్నదే గుడి నిర్మాణం వెనకాల ఉన్న ఉద్దేశం. ఇది వాస్తవమే అని రుజువైంది. వినాయకుడిని ప్రతిష్టించిన తర్వాత టీమిండియా ఓడిపోలేదు" అని తెలిపారు.

ధోని గుడి ముందు నిలబడి గణపతి ఆశీర్వాదాలు

ధోని గుడి ముందు నిలబడి గణపతి ఆశీర్వాదాలు

"మ్యాచ్‌లు ఉన్నప్పుడు ప్రాక్టీస్‌ సెషన్లు పూర్తికాగానే ధోని గుడి ముందు నిలబడి గణపతి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. అలాగే మరో క్రికెటర్‌ కర్ణ్‌శర్మ గుడికి వస్తాడు" అని హనుమంతు శర్మ తెలిపారు. ఈ ఆలయం నిర్మించిన తర్వాత 2011, అక్టోబర్‌ 14న ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

ఆ తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో టీమిండియా విజయం

ఆ తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో టీమిండియా విజయం

అలాగే 2010లో న్యూజిలాండ్‌తో ఈ గ్రౌండ్‌లో టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత్‌.. ఆ తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో విజయాలు సొంతం చేసుకుంది. ఈ వినాయకుడి ఆలయాన్ని గొప్ప క్రికెటర్లు సందర్శిస్తారని హనుమంతు శర్మ అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో విండిస్ ఆడుతున్న తీరు చూస్తే ఈ టెస్ట్‌లోనూ టీమిండియా విజయం సాధించేలా కనిపిస్తోంది.

Story first published: Saturday, October 13, 2018, 9:49 [IST]
Other articles published on Oct 13, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+