పాక్ స్కోర్ 456: లక్ష్మణ్ కు వికెట్
కోల్ కత్తా: ఎట్టకేలకు ఈడెన్ గార్డెన్స్ లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్సు ముగిసింది. ఆట నాలుగో రోజు సోమవారం ఉదయం పాకిస్తాన్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. సోమవారంనాడు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్సులో 456 పరుగులు చేసి ఆలవుట్ అయింది. ఆరు వికెట్ల నష్టానికి 358 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఉదయం పాకిస్తాన్ బ్యాటింగుకు దిగింది. మరో 98 పరుగులు జోడించి పాకిస్తాన్ ఇన్నింగ్సును ముగించింది. సోమవారం ఉదయం వివియస్ లక్ష్మణ్ వేసిన బంతికి సమీ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జాఫర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత తన్వీర్, అక్తర్, కనేరియా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారి పట్టారు. హర్బజన్ కు ఐదు వికెట్లు లభించగా కుంబ్లేకు మూడు వికెట్లు లభించాయి. మరో వికెట్ మునాఫ్ పటేల్ కు దక్కింది. మిస్బావుల్ హక్ ను మాత్రం భారత బౌలర్లు అవుట్ చేయలేకపోయారు. మిస్బా 161 పరుగులతో నాటవుటుగా మిగిలాడు.వెంట వెంటనే రెండు వికెట్లను కోల్పోవడంతో కోల్‌కతా ఈడెన్‌గార్డెన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసింది. లక్ష్మణ్ వేసిన బంతితో సాఫర్ క్యాచ్‌తో అహ్మద్ సమీ(38) పెవిలియన్ దారి పట్టాగా, కుంబ్లే బౌలింగ్‌తో ద్రావిడ్ క్యాచ్ ద్వారా తన్వీర్(0) చతికిలపడ్డాడు. ఆరు వికెట్ల నష్టానికి 358 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటన ప్రారంభించిన పాక్ అదో జోరునే కొనసాగిస్తుండడంతో భోజన విరామ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. అంతకుముందు 150 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కురుకుపోయిన జట్టును మిస్బా వుల్ హక్, వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (119)లు ఆదుకున్నారు. మూడో రోజు ఆట ప్రారంభంలో జట్టుకు చేయూతమిస్తాడనుకున్న సల్మాన్ భట్ (42) హర్బజన్ విసిరిన బంతిని ద్రావిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఇంటిముఖం పట్టాడు. అనంతరం రెండు ఓవర్లకే పటేల్ విసిరిన బంతితో ధోనీ కీపర్ క్యాచ్ ద్వారా యూనిస్కాన్(43) ఔటయ్యాడు. తర్వాత కుంబ్లే, మునాఫ్‌లు ఒక్కో వికెట్ తీయడంతో 150 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. అయితే మిస్బా వుల్ హక్, అక్మాల్‌లు ఆచి తూచి ఆడుతూ జట్టు స్కోరును పెంచుతూ క్రీజ్‌లో స్థిరపడి పోయారు. ఎట్టకేలకు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్సు 456 పరుగుల వద్ద ముగిసింది. అంతకు ముందు భారత్ ఐదు వికెట్ల నష్టానికి 616 పరుగులు చేసి తొలి ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది.
Story first published: Monday, December 3, 2007, 23:53 [IST]
Other articles published on Dec 3, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications