Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా సచిన్ ఎదగడంలో అతని పాత్ర మరువలేనిది: శివరామకృష్ణన్‌

Laxman Sivaramakrishnan says Kris Srikkanth helped Sachin Tendulkar become world’s best batsman

న్యూఢిల్లీ: భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రంగా నిలిచాడు. 24 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌ మాస్టర్ బ్లాస్టర్. ఓపెనర్‌గా పరుగుల వరద పారించాడు. అయితే సచిన్ వరల్డ్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి ఓ భారత మాజీ కెప్టెన్‌ ప్రోత్సాహం ఉందట. అతను మరెవరో కాదు కృష్ణమాచారి శ్రీకాంత్‌. సచిన్‌ ఎదగడంలో శ్రీకాంత్‌ పాత్ర మరువలేనిదని మాజీ లెగ్‌ స్పిన్నర్‌ లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ తెలిపాడు.

శ్రీకాంత్‌ బాగా ప్రోత్సహించాడు

శ్రీకాంత్‌ బాగా ప్రోత్సహించాడు

తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన తమిళ క్రికెట్‌ కనెక్టెడ్‌ షోలో లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ పలు విషయాల్ని పంచుకున్నాడు. 'కృష్ణమాచారి శ్రీకాంత్‌ అగ్రెసివ్‌ బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. అగ్రెసివ్‌ కెప్టెన్‌ కూడా. ఫలితాలు సాధించడం ద్వారానే అతను ఏమిటో నిరూపించుకున్నాడు. శ్రీకాంత్‌ చాలా చురకైన వాడు. సచిన్‌ టెండూల్కర్‌ లాంటి ఆటగాడు చీకా కెప్టెన్సీలో అరంగేట్రం చేశాడు. సచిన్‌ను శ్రీకాంత్‌ బాగా ప్రోత్సహించాడు. చీకా ఇచ్చిన సహకారంతోనే అప్పుడు యుక్త వయసులో ఉన్న సచిన్‌లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. అదే అతన్ని వరల్డ్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది' అని శివరామకృష్ణన్‌ చెప్పాడు.

చీకా కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం

చీకా కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం

'ప్రపంచ క్రికెట్లో మనం చాలా మంది స్ఫూర్తిదాయకమైన కెప్టెన్లను చూశాం. అందులో కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఒకడు. చీకా సుదీర్ఘ కాలం భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా చేస్తాడనుకున్నా. కానీ అలా జరగలేదు. నాకు శ్రీకాంత్‌ కెప్టెన్సీ అంటే చాలా చాలా ఇష్టం. అయితే చాలా తక్కువ సమయం మాత్రమే చీకా కెప్టెన్‌గా ఉండటం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది' అని శివరామకృష్ణన్‌ తెలిపాడు. కేవలం 4 టెస్టులు, 13 వన్డేలకు మాత్రమే కృష్ణమాచారి శ్రీకాంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

కెరీర్‌ తొందరగా ముగుస్తుందనుకోలేదు

కెరీర్‌ తొందరగా ముగుస్తుందనుకోలేదు

తన కెరీర్‌ కూడా తొందరగా ముగిసిపోవడంపై లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ నిరాశ వ్యక్తం చేసాడు. తనకు అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినా.. మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నాడు. గవాస్కర్ మార్గనిర్దేశంలో గైడెన్స్‌ తనకు ఎంతగానో ఉపయోగిపడిందన్నాడు. భారత్‌ తరఫున శివరామకృష్ణన్‌ 9 టెస్టులు, 16 వన్డేలను మాత్రమే ఆడాడు. ఆ తర్వాత క్రికెట్ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. భారత్‌ తరఫున పెద్దగా సక్సెస్ కాకపోయినా.. కామెంటేటర్‌గా మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు.

కెరీర్‌లో 34,357 పరుగులు:

కెరీర్‌లో 34,357 పరుగులు:

సచిన్ టెండూల్కర్ విజయవంతమైన కెరీర్‌లో ఏదైనా లోటు ఉందంటే అది కెప్టెన్సీ ఒక్కటే. 1996 ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక మ్యాచ్‌ గల బోర్డర్ గావస్కర్ సిరీస్‌తో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సచిన్.. 73 వన్డేలు, 25 టెస్టుల్లో జట్టును నడిపించాడు. కానీ జట్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలన్నందించలేకపోయాడు. అతని సారథ్యంలో భారత్ 23 వన్డేలు, 4 టెస్ట్‌లు మాత్రమే గెలవడం గమనార్హం. వ్యక్తిగతంగా రాణించినా.. జట్టును నడిపించడంలో మాత్రం లిటిల్ మాస్టర్ విఫలమయ్యాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశాడు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు.

హార్దిక్ పాండ్యా వర్కౌట్ వీడియో.. ఫిదా అయిన బాలీవుడ్ భామలు!!

Story first published: Monday, June 22, 2020, 15:06 [IST]
Other articles published on Jun 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+