Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లక్ష్మణ్ సెంచరీ:భారత్ 216/3

Laxman

సిడ్నీ:వివియస్ లక్ష్మణ్ మరోమారు ఆసీస్ పై తన సత్తాను చాటాడు. ఆసీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు లక్ష్మణ్ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ లో ఓటమి చవి చూసిన భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్నిచ్చాడు. భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించేలా చేశాడు. రాహుల్ ద్రవిడ్(53)తో కలిసి రెండో వికెట్ కు 175 పరుగులు జోడించి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడానికి తోడ్పడ్డాడు. లక్ష్మణ్ 142 బంతులను ఎదుర్కొని 18 ఫోర్లతో 109 పరుగులు చేసి హాగ్ బౌలింగ్ లో హస్సీకి క్యాచ్ ఇచ్చి మూడవ వికెట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు అర్థ సెంచరీ సాధించి లక్ష్మణ్ కు చక్కటి సహకారం అందించిన ద్రావిడ్, జాన్సన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. రెండో రోజు ఆట ముంగిసే సమయానికి క్రీజ్ లో ఉన్న సచిన్ 9 పరుగులతోను, గంగూలీ 21 పరుగులతోను ఆడుతున్నారు.

అంతకుముందు ఏడు వికెట్ల నష్టానికి 376 పరుగులతో తమ ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ జట్టు 463 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి రోజు సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచిన అండ్రూ సైమండ్స్ 162 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. పరుగులు చేసి నిలిచిన బ్రెట్ లీ 59 పరుగులు సాధించడం విశేషం. వీరిద్దరూ కలిసి ఎనిమిదవ వికెట్ భాగస్వామ్యంలో 114 పరుగులు జోడించడం ఆసీస్ బ్యాటింగ్ బలాన్ని చాటిచెప్పినట్టయింది.
Story first published: Thursday, January 3, 2008, 16:42 [IST]
Other articles published on Jan 3, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+