Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి మహిళా అంఫైర్‌గా చరిత్ర సృష్టించిన లారెన్ అజెన్‌బ్యాగ్

Lauren Agenbag creates history to become the 1st female umpire to officiate in mens first-class game

హైదరాబాద్: దక్షిణాఫ్రికాకు చెందిన 23 ఏళ్ల లారెన్ అజెన్‌బ్యాగ్ అరుదైన ఘనత సాధించింది. పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కి అంఫైర్‌గా వ్యవహారించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. జోహెన్స్‌బర్గ్ వేదికగా గత గురువారం నుండి శనివారం వరకు సెంట్రల్ గౌటెంగ్ లయన్స్-బోలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల మ్యాచ్‌లో అంఫైర్‌గా వ్యవహారించింది.

ఈ ఏడాది ఆరంభంలో కేప్ టౌన్ వేదికగా శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా లారెన్ అజెన్‌బ్యాగ్ అంఫైర్‌గా వ్యవహారించారు. ఫలితంగా క్రికెట్ దక్షిణాఫ్రికా తరుపున ఓ టీ20 మ్యాచ్‌కి అంఫైర్‌గా వ్యవహారించిన తొలి మహిళగా నిలిచారు. దీంతో పాటు ఐసీసీ మహిళల అంఫైర్ ప్యానెల్‌లో కూడా సభ్యురాలుగా ఉన్నారు.

ఈ విషయమై క్రికెట్ దక్షిణాఫ్రికా క్రికెట్ యాక్టింగ్ డైరెక్టర్ కోర్రీ మాట్లాడుతూ "లారెన్ దక్షిణాఫ్రికాలో మహిళల అంపైరింగ్‌కు స్టాండర్డ్ బేరర్‌గా మారారు. వ్యక్తిగత కలలను సాకారం చేసుకునేందుకు అవసరమైన అంకితభావం ఉంటే సాధించడానికి పరిమితి ఏదీ లేదని ఆమె చూపించింది" అని అన్నారు.

Story first published: Thursday, October 24, 2019, 12:37 [IST]
Other articles published on Oct 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+