Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli:సెమీస్‌ విజయంతో కోహ్లీ టాప్ - కానీ రోహిత్ డౌన్!

Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రీసెంట్ గానే వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడు మరో స్థానం మెరుగుపరుచుకుని నాలుగో స్థానంలోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ పోరులో మంచి ప్రదర్శన చేసిన అనంతరం ఒక స్థానం ఎగబాకాడు. 98 బంతుల్లో 84 పరుగులు చేసిన అతడు.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 747 రేటింగ్ పాయింట్లతో నిలిచాడు.

ఇదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానం నుంచి రెండు ర్యాంకులు కిందకి పడిపోయాడు. ప్రస్తుతం 745 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా.. పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్, హెన్రిచ్ క్లాసెన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఒక్క స్థానం ఎగబాకి 8వ ర్యాంకుంలో నిలిచాడు. కేఎల్ రాహుల్ 15వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. మొత్తంగా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ -10లో నలుగురు బ్యాటర్లు నిలవడం విశేషం.

Latest ODI rankings Kohli climbs to 4th place rohit falls down after champions trophy 2025 semifinal

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్‌ తీక్షణ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్, కుల్దీప్ యాజవ్ రెండు, మూడు నుంచి చెరో మూడు స్థానాలు కిందకి పడిపోయి ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. దీంతో 2,3 ర్యాంకుల్లోకి సౌతాఫ్రికా కేశవ మహారాజ్, న్యూజిలాండ్ మ్యాథ్యూ హెన్రీ వచ్చారు. మహ్మద్ షమీ 3 ర్యాంకులు ముందుకు జరిగి 11వ స్థానంలో నిలవగా.. 13వ స్థానంలో జడేజా ఉన్నాడు. సిరాజ్ రెండు స్థానాలు కిందకి పడిపోయి 14వ ర్యాంకులో నిలిచాడు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయి అగ్రస్థానంలో, మహ్మద్ నబీ రెండో స్థానంలో నిలిచారు. రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అక్సర్ పటేల్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకోగా, హార్దిక్ పాండ్య మూడు స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.

Story first published: Wednesday, March 5, 2025, 15:34 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+