For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలీవుడ్ హీరోయిన్‌తో పంత్‌ డేటింగ్‌?.. ఎవరా భామ!!

Is Rishabh Pant Dating With Bollywood Actress ? || Oneindia Telugu
Late Night dinner in Mumbai: Is India cricketer Rishabh Pant dating Bollywood actress Urvashi Rautela?

ముంబై: టీమిండియా సీనియర్ వికెట్‌ కీపర్‌, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషభ్‌ పంత్‌. 22 ఏళ్ల పంత్‌ బ్యాటింగ్‌, కీపింగ్‌లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది మాత్రం క్రికెట్ ఆటతో కాదు.

 ఊర్వశితో డిన్నర్‌:

ఊర్వశితో డిన్నర్‌:

రిషభ్‌ పంత్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశి రౌతెలా డేటింగ్‌లో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన మూడో టీ20కి ముందు పంత్‌, ఊర్వశి కలిసి ముంబైలోని ఓ ఖరీదైన హోటల్‌లో డిన్నర్‌ చేస్తూ కనిపించారు. దీంతో ఈ జోడీ డేటింగ్‌లో ఉన్నట్లు చర్చ సాగుతోంది.

 జోయా ఫ్యాక్టర్ అవుతుందా:

జోయా ఫ్యాక్టర్ అవుతుందా:

ఊర్వశితో డిన్నర్ అనంతరం ఆడిన చివరి టీ20 మ్యాచ్‌లో పంత్ డకౌటయ్యాడు. దీంతో నెటిజన్లు పంత్‌ని ఓ ఆటాడుకుంటున్నారు. ఊర్వశితో డిన్నర్‌ మధురానుభూతుల నుంచి బయటపడకపోవడమే మనోడి వైఫల్యానికి కారణం అని నెటిజన్లు పంత్‌ను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పేలవ ఫామ్‌తో కష్టాల్లో ఉన్న పంత్‌కు ఊర్వశి 'జోయా ఫ్యాక్టర్‌' అవుతుందేమో చూడాలని మరికొందరు అంటున్నారు. ఇషా నేగి అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నానని పంత్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

 గతంలో హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్‌:

గతంలో హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్‌:

ఊర్వశి రౌతెలా గతంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్‌ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే వీటిని ఇద్దరు కొట్టిపారేశారు. ఇక హార్దిక్‌ నాచ్‌ బేలియె స్టార్ నటాషా స్టాన్‌కోవిచ్‌తో ప్రేమలో ఉండంతో ఆ వార్తలకు పులిస్టాప్ పడింది. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ ఊర్వశిని హార్దిక్ మాజీ ప్రేయసి అని పేర్కొంటూ ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోను చూసిన ఊర్వశి.. ఇలాంటి వీడియోలను దయచేసి పోస్ట్ చేయొద్దంటూ వేడుకుంది.

టెస్ట్ ఫార్మాట్‌లో చోటు గల్లంతు:

టెస్ట్ ఫార్మాట్‌లో చోటు గల్లంతు:

జట్టులోకి వచ్చిన పంత్‌ మొదట్లో బాగానే ఆడినా.. గత కొంతకాలంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. పదేపదే ఒకటే షాట్లతో ఔట్ అవుతూ పెద్దఎత్తున విమర్శలు అందుకున్నాడు. పేలవమైన షాట్లతో పంత్‌ ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్‌లో తన స్థానాన్ని కోల్పోయాడు. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే పంత్‌కు టీమిండియాతో పాటు జట్టు యాజమాన్యం అండగా నిలుస్తోంది. మాజీ క్రికెటర్లు కూడా పంత్‌కు సమయం ఇవ్వాలని సూచిస్తున్నారు.

టీ20 సిరీస్‌లో విఫలం:

టీ20 సిరీస్‌లో విఫలం:

తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పంత్ విఫలమయ్యాడు. తొలి టీ20లో 18 పరుగులు చేసిన పంత్.. రెండో టీ20లో 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ. మూడో టీ20లో ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరుకున్నాడు. భారీ షాట్లు ఆడుతాడేమో అని కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో పంపాడు. మరి వన్డే సిరీస్‌లో అయినా రాణిస్తాడేమో చూడాలి.

Story first published: Friday, December 13, 2019, 12:20 [IST]
Other articles published on Dec 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+