Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్కరైనా సపోర్టుగా నిలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది: శ్రేయస్‌ అయ్యర్‌

IPL 2019 : Shreyas Iyer Disappointed As Delhi Lose Heavily Again || Oneindia Telugu
Last two games have been disappointing says Shreyas Iyer

స్వల్ప వ్యవధిలోనే టాప్‌ ఆర్డర్‌ వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో నాకు ఒక్కరైనా సపోర్టుగా నిలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపారు. గురువారం రాత్రి సొంత గడ్డపై సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీకి ఊహించని ఓటమి ఎదురైంది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడారు.

పిచ్ కఠినంగా ఉంది:

పిచ్ కఠినంగా ఉంది:

'వెంటవెంటనే రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేశాయి. బ్యాటింగ్ చేయడానికి పిచ్ కఠినంగా ఉంది. ముందుగా బౌలింగ్‌ చేయడం వల్ల వికెట్‌ను సన్‌రైజర్స్‌ జట్టు ఆటగాళ్లు పూర్తిగా అర్థం చేసుకొని ఓ అవగాహనకు వచ్చారు. మేము బ్యాటింగ్ బాగా చేయలేదు. బ్యాటింగ్‌ వైఫల్యమే మా ఓటమికి కారణం' అని శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపారు.

టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది:

టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది:

'మొదటి టైం అవుట్ తర్వాత ఈ వికెట్‌పై కనీసం 140-150 పరుగులు చేస్తే మంచి స్కోర్ అని భావించా. కనీసం 150 పరుగులు చేసి ఉంటే ముగ్గురు స్పిన్నర్లకు పోరాడే అవకాశం ఉండేది. స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పోయాం. ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. ఆ సమయంలో నాకు ఒక్కరైనా సపోర్టుగా నిలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. దురదృష్టవశాత్తు రషీద్‌ నన్ను పెవిలియన్‌కు చేర్చాడు. తొలి ఓవర్లలో సన్‌రైజర్స్‌ బాగా ఆడింది. అప్పుడే ఓటమి ఖాయం అని భావించా. అయితే మా బౌలర్లు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లడం అభినందనీయం. రానున్న మ్యాచ్‌లలో మెరుగ్గా రాణిస్తాం' అని శ్రేయస్‌ చెప్పుకొచ్చారు.

హ్యాట్రిక్‌ విజయం:

హ్యాట్రిక్‌ విజయం:

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రాణించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, నబీ, సిద్దార్థ్‌ కౌల్‌ఖ తలో రెండు వికెట్లు తీశారు. లక్ష ఛేదనలో బెయిర్‌ స్టో(48) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే బెయిర్‌ స్టో అవుటయిన తర్వాత వార్నర్‌(10), విజయ్‌ శంకర్‌(16), పాండే(10), హుడా(10)లు నిరాశపరిచినా.. నబీ (17) మ్యాచ్‌ను ముగించాడు. దీంతో హైద్రాబాదు జట్టు హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది.

Story first published: Friday, April 5, 2019, 11:12 [IST]
Other articles published on Apr 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+