Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో అమ్ముడుపోని మలింగ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనా?

 Lasith Malinga set to retire?

హైదరాబాద్: తన యార్కర్లతో ప్రత్యర్ధి జట్ల బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేసిన శ్రీలంక శ్రీలంక యార్కర్ల స్పెషలిస్ట్ లసిత్ మలింగ కెరీర్‌ ఇక ముగిసినట్లేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత ఐదు నెలలుగా శ్రీలంక జట్టుకి దూరంగా ఉంటున్న మలింగను బెంగళూరు వేదికగా ముగిసిన ఐపీఎల్ 2018 వేలంలోనూ ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబర్చలేదు.

దీంతో 2019 వరల్డ్ కప్ టోర్నీ కంటే ముందే మలింగ రిటైర్మెంట్‌ ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమచారం. ఐపీఎల్ టోర్నీ‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన మలింగ ముంబై ఇండియన్స్‌ తరఫున 110 మ్యాచ్‌లాడి 154 వికెట్లు తీసుకున్నాడు. 2011లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.

గతేడాది రైజింగ్ పూణె సూపర్ జెయింట్ తరుపున ఆడిన మలింగ ఫైనల్లో 4-0-21-0తో ముంబై జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేశాడు. అయినప్పటికీ ఈ ఏడాది వేలంలో మలింగను కొనుగోలు చేసేందుకు ముంబై ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు. ఫిటెనెస్ సమస్యలు, పేలవ ఫామ్ ఇందుకు కారణం.

ఇప్పటికే శ్రీలంక జట్టుకి దూరమైన మలింగ తాజాగా ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ని కూడా చేజార్చుకోవడంతో తన కెరీర్ గురించి తీసుకోబోయే నిర్ణయంపై సన్నిహితుల వద్ద చర్చిస్తున్నాడని సమాచారం. సండే టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో 'ఫాస్ట్ బౌలర్‌గా ఇక ఎక్కువ కాలం కొనసాగలేను. నాలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని నాకు తెలుసు. కానీ.. ఆటగాడిగా కాకుండా.. కోచ్‌గా దాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తా' అని చెప్పాడు.

'ఎవనైనా సరే.. వరల్డ్ కప్ కోసం మా జట్టుకి బౌలింగ్ కోచ్‌గా ఉండమంటే.. కచ్చితంగా బాధ్యతలు స్వీకరిస్తా. ఎందుకంటే.. నాలోని బౌలింగ్ నాలెడ్జిని ఇతరులతో పంచుకోవాలని చూస్తున్నా' అని మలింగ చెప్పుకొచ్చాడు. 34 ఏళ్ల మలింగ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

శ్రీలంక తరుపున 30 టెస్టులు, 204 వన్డేలు, 68 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2007, 2011లో మలింగ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ రెండు ఎడిషన్లలో శ్రీలంక జట్టు రన్నరప్‌గా నిలిచింది. 2014లో వరల్డ్ టీ20 గెలిచిన శ్రీలంక జట్టులో మలింగ సభ్యుడిగా ఉన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 17:41 [IST]
Other articles published on Jan 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+