Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

24 బంతులు వేయగలను.. కానీ అది మాత్రం అసలు చేయలేను: స్టార్ పేసర్

Lasith Malinga says I can still bowl 24 balls But cant complete 2km fitness test

కొలొంబో: లసిత్ మలింగ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా వికెట్లు తీయడమే అతడికి తెలుసు. ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌ను సైతం తన యార్కర్ బంతులతో వణికించాడు. హ్యాట్రిక్ తీయడమే కాకుండా.. వరుస నాలుగు బంతుల్లో 4 వికెట్లు తీసిన ఘనత శ్రీలంక వెటరన్ పేసర్ మలింగ సొంతం. అలాంటి బౌలర్ గతేడాది కాలంగా జాతీయ జట్టుకు ఎంపికకావడం లేదు. కారణం అతడి ఫిట్‌నెస్. ఇప్పటికే వన్డే, టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన మలింగ.. కేవలం టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. కానీ శ్రీలంక క్రికెట్ బోర్డు గత ఏడాది తెరపైకి తెచ్చిన 2కిమీ ఫిట్‌నెస్ టెస్టు.. 37ఏళ్ల మలింగ కెరీర్‌కి బ్రేక్‌ లేసింది.

 ఏడాదికి పైగా దూరం:

ఏడాదికి పైగా దూరం:

తమ ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు గతేడాది నుంచి కఠిన నియమాలను అమలు చేస్తోంది. జాతీయ జట్టులో చోటు దక్కాలంటే.. ఏ ఆటగాడైనా 2 కిలో మీటర్లను నిర్ణీత సమయంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇది చాలా మందికి భారంగా మారింది. ముఖ్యంగా 37ఏళ్ల లసిత్ మలింగకు. మలింగ చివరిగా 2020 మార్చిలో లంక తరఫున మ్యాచ్‌ ఆడాడు. ఏడాదికి పైగా మ్యాచ్ ఆడకున్నా.. యూఏఈ వేదికగా ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడుతానని మలింగ ధీమా వ్యక్తం చేశాడు. మలింగ లంక తరఫున 30 టెస్టులు, 226 వన్డేలు, 84 టీ20లు ఆడాడు. మొత్తంగా 546 వికెట్లు పడగొట్టాడు.

2కిమీ మాత్రం పరుగెత్తలేను:

2కిమీ మాత్రం పరుగెత్తలేను:

రస్సెల్ ఆర్నాల్డ్ యూట్యూబ్ షో 'చిల్లింగ్ విత్ రస్సెల్'లో తాజాగా లసిత్ మలింగ పాల్గొని పలు విషయాలపై స్పందించాడు. 'టీ20 ప్రపంచకప్‌ 2021 ఉందని చెప్పట్లేదు. ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనే లేదు. నేను ఇప్పటికీ టీ20 మ్యాచ్‌లో 24 బంతులు వేయగలను. కానీ 2కిమీ మాత్రం పరుగెత్తలేను. అందుకే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. నాలుగు ఓవర్లే కాదు.. నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు గంటలు కూడా బౌలింగ్ చేయగలను. 35 ఏళ్ల వయసులో న్యూజిలాండ్‌పై వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు తీశాను. కానీ అప్పుడు ఎవరూ నా ఫిట్‌నెస్ గురించి మాట్లాడలేదు. ఇప్పటికీ నేను 200 బంతులు ఒకే తీవ్రతతో సంధించగలను' అని అన్నాడు.

 మలింగను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్:

మలింగను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్:

శ్రీలంక జట్టు ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. లంక వరుసగా మూడు టీ20ల్లో ఓడి 0-3తో సిరీస్‌ని చేజార్చుకుంది. లంక బౌలింగ్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ ఎలాంటి ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేశారు. ఒక్క మ్యాచులో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయారు. లసిత్ మలింగ లేని లోటు లంక జట్టుకు స్పష్టంగా తెలిసొచ్చింది. దాంతో టీ20 ప్రపంచకప్ జట్టులో మలింగ ఉండాలనే డిమాండ్ పెరుగుతోంది. లంక అభిమానులు మలింగను జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఐదు హ్యాట్రిక్ వికెట్లు:

ఐదు హ్యాట్రిక్ వికెట్లు:

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదు సార్లు హ్యాట్రిక్ వికెట్లు నమోదు చేసిన తొలి బౌలర్‌గా లసిత్ మలింగ రికార్డుల్లో కొనసాగుతున్నాడు. వన్డేల్లో మూడు, టీ20ల్లో రెండు హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇక నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు రెండుసార్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2007లో మలింగ తొలిసారి నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మలింగ బుల్లెట్ బంతులకు షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, జాక్ కలిస్, మఖయా ఎన్తిని వరుసగా పెవిలియన్ చేరారు. 2019 సెప్టెంబర్‌లో పల్లెకెలె వేదికగా కివీస్‌తో జరిగిన టీ20లో మరోసారి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మున్రో, రూథర్‌ఫోర్డ్, గ్రాండ్‌హోమ్‌,టేలర్‌లను ఔట్ చేశాడు.

Story first published: Wednesday, June 30, 2021, 20:47 [IST]
Other articles published on Jun 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+