Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మలింగ ఆ పద్ధతి మార్చుకో.. లేదంటే కరోనా వస్తది: సచిన్

Lasith Malingas ball-kissing run up routine needs to change says Sachin Tendulkar

ముంబై: ప్రపంచ క్రికెట్‌లో ఒక్కో బౌలర్‌కు ఒక్కో విధమైన శైలి ఉంటుంది. ఇక బంతి వేసే ముందు ప్రతి బౌలర్ తమదైన అలవాటును చూపిస్తారు. అలానే శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగకు బంతి వేసే ప్రతీసారీ దాన్ని ముద్దాడడం అలవాటు. ఇప్పుడు ఇదే అతనికి ప్రతిబంధకంగా మారింది. ఎందుకంటే.. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్లు ఆ మహమ్మారి బారిన పడకుండా ఐసీసీ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆటగాళ్లు బంతి మెరుపు కోసం ఉమ్మిపూయడం నిషిద్ధం.

ఏమంటావ్‌ మలింగా?:

తాజాగా లసిత్ మలింగ ఫొటోను క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షేర్ చేశారు. ఆ ఫొటోలో చేతిలోని బంతిని మలింగ ముద్దాడుతున్నాడు. బౌలింగ్ చేసే ప్రతిసారీ ఇలా బంతిని మలింగ ముద్దాడుతాడు. ఈ ఫొటోనే షేర్ చేసిన సచిన్.. ఇకపై మలింగ ఇలా చేయడం ఆపేయాలి? అంటూ ట్వీట్ చేశాడు. 'ఐసీసీ కొత్త నిబంధనల్లో భాగంగా ఎవరైనా తమ బౌలింగ్‌ పద్ధతిని మార్చుకోవాల్సి ఉంది. ఏమంటావ్‌ మలింగా?' అంటూతన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. మలింగ ఆ పద్ధతి మార్చుకో.. లేదంటే కరోనా వస్తది అని సచిన్ చెప్పకనే చెప్పాడు.

122 మ్యాచ్‌లు.. 170 వికెట్లు:

122 మ్యాచ్‌లు.. 170 వికెట్లు:

గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లీగ్‌లో లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 122 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు ప‌డ‌గొట్టిన మ‌లింగ అత్యంత వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్ల జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. మలింగ లంక తరఫున 84 టీ20లు ఆడి 107 వికెట్లు పడగొట్టాడు. ఒకసారి 5 వికెట్లు తీసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్ కూడా మలింగనే.

చెమట పట్టకపోతే ఎలా?:

చెమట పట్టకపోతే ఎలా?:

తాజాగా సలైవా (ఉమ్మి) వాడకుండా ఐసీసీ నిషేధించడాన్ని సచిన్‌ టెండూల్కర్‌ ప్రశ్నించాడు. 'ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో వాతావరణం (శీతల వాతావరణం) భిన్నంగా ఉంటుంది. అక్కడ చెమట రాకపోతే ఏం చేయాలి. ఆ దేశాల్లో పర్యటించేటప్పుడు ఆటగాళ్లు ఎక్కువ పొరలున్న దుస్తులు ధరిస్తుంటారు. 1992 మేలో నేను యార్క్‌షైర్‌లో పర్యటించినప్పుడు అక్కడ బాగా చలేసింది. ఐదు పొరల వస్త్రాలు ధరించాను. అలాంటప్పుడు చెమట రాకపోతే బంతికి మెరుపు ఎలా తీసుకొస్తాం' అని సచిన్‌ ప్రశ్నించాడు.

 కొత్త బంతులపై ఏమన్నాడంటే?:

కొత్త బంతులపై ఏమన్నాడంటే?:

వన్డేల్లో రెండు కొత్త బంతులు వాడొచ్చనే కొత్త నిబంధన పైనా లిటిల్ ‌మాస్టర్‌ సచిన్ గత నెలలోనే స్పందించాడు. ఐసీసీ మేలో ఓ ట్వీట్‌ చేస్తూ.. వన్డేల్లో ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాని విధంగా సచిన్‌-గంగూలీ జోడీ 8200కి పైగా పరుగులు చేసిందని అభిమానులకు గుర్తుచేసింది. ఇది చూసి స్పందించిన సచిన్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పుడున్న నిబంధనలు (ఔట్‌ ఫీల్డ్‌లో 4 ఫీల్డర్లతో పాటు రెండు కొత్త బంతులు) తాము ఆడే రోజుల్లో ఉండి ఉంటే ఇంకెన్ని పరుగులు చేసేవాళ్లమో అంటూ దాదాను అడిగాడు. అందుకు స్పందించిన గంగూలీ.. వన్డేల్లో ఇప్పట్లా రెండు కొత్త బంతులకు అనుమతి ఉంటే తామిద్దరం మరో 4వేల పరుగులు చేసేవాళ్లమని బదులిచ్చాడు.

త్వరలోనే 'ఎంఎస్ ధోనీ సాంగ్‌ నం7'.. హెలికాఫ్టర్‌ డ్యాన్స్‌ కూడా!!

Story first published: Thursday, June 25, 2020, 10:35 [IST]
Other articles published on Jun 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+