For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గత పదేళ్లుగా మ్యాచ్‌ విన్నర్‌ మలింగనే: రోహిత్ శర్మ

Rohit Sharma Heartfelt Message For Lasith Malinga As He Retires From ODI || Oneindia Telugu
vLasith Malinga Retires from ODIS: Rohit Sharma, Jasprit Bumrah post heartfelt messages


ముంబై: గత పదేళ్లుగా ముంబై ఇండియన్స్‌కు మ్యాచ్‌ విన్నర్‌ లసిత్‌ మలింగనే అని టీమిండియా వైస్‌ కెప్టెన్‌, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నారు. శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో మలింగ బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. వన్డేల నుండి కూడా తప్పుకున్నాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడనున్నాడు.
మ్యాచ్‌ విన్నర్‌ మలింగనే:

మ్యాచ్‌ విన్నర్‌ మలింగనే:

మలింగ వన్డేలకు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో రోహిత్ శర్మ తన అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'గత దశాబ్ద కాలంలో ముంబై ఇండియన్ తరపున ఒక మ్యాచ్ విన్నర్‌ను ఎంచుకోమంటే.. మలింగ ముందు వరుసలో ఉంటాడు. కెప్టెన్‌గా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నాకు ఎంతో అండగా నిలిచాడు. కొన్ని సందర్భాల్లో ఊపిరి పీల్చుకోవడానికి మలింగనే కారణం. వైవిధ్యమైన బంతులతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా' అని రోహిత్ పేర్కొన్నాడు.

నీ బౌలింగ్‌ స్పెల్‌ క్లాసిక్‌:

నీ బౌలింగ్‌ స్పెల్‌ క్లాసిక్‌:

టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కూడా మలింగ రిటైర్మెంట్‌పై ట్వీట్‌ చేశాడు. 'నీ బౌలింగ్‌ స్పెల్‌ ఓ క్లాసిక్‌. క్రికెట్‌కు మీరు చేసిన అద్భుతమైన సేవలకు ధన్యవాదాలు. మీరు అంటే ఎప్పుడూ అభిమానమే, దాన్ని అలానే కొనసాగిస్తా' అని బుమ్రా ట్విటర్‌లో రాసుకొచ్చారు. మలింగ, రోహిత్‌, బుమ్రా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

నా సమయం ముగిసింది:

నా సమయం ముగిసింది:

బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ అనంతరం మలింగ మాట్లాడుతూ... 'వన్డేల నుంచి రిటైర్‌ అవ్వడానికి ఇదే సరైన సమయం అనిపించింది. గత 15 సంవత్సరాలుగా శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించా. నా సమయం ముగిసింది. ఇక నేను వెళ్లాలి. లంక జట్టులో కొంతమంది యువ బౌలర్లు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. యువ బౌలర్లు మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్‌ను ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ జట్టుకు మ్యాచ్ విన్నర్ కావాలి' అని మలింగ పేర్కొన్నాడు.

Story first published: Saturday, July 27, 2019, 17:31 [IST]
Other articles published on Jul 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+