Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టులో చేర్చుకుంటే నేనూ ఆడాలనే అనుకుంటున్నా: మలింగ

హైదరాబాద్: వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న శ్రీలంక జట్టు గురించి మలింగను ఓ ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. టీంకు కొంత కాలంగా దూరంగా ఉంటున్న లసిత్ మలింగను తన ఆవేదనను ఇలా బయటపెట్టాడు. 'నాకు ఆడాలనుంది. సెలక్టర్లు నన్ను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదో తెలియడం లేదు. 25, 26 సంవత్సరాల వారికైతే విశ్రాంతి అవసరమేమో కానీ, ఇంకా రెండు మూడేళ్లలో క్రికెట్ నుంచి తప్పుకునే వాడిని. నాలాంటి వాడికెందుకు విశ్రాంతి.' అని ప్రశ్నిస్తున్నాడు.

ఇంకా, మాట్లాడుతూ.. 2019 ప్రపంచకప్‌ వరకు తను ఆడాలని కోరుకుంటున్నానన్నాడు. గత కొన్నాళ్ల నుంచి మలింగ జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో భారత్‌తో జరిగిన ఓ టీ20లో మలింగ చివరిసారిగా ఆడాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్‌లోనూ సెలక్టర్లు మలింగకు స్థానం కల్పించలేదు.

వరుస పరాజయాలతో కుంగిపోయి ఉన్న శ్రీలంక జట్టులో ప్రధాన మార్పులు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైనది కోచ్‌ను మార్చడం. ఆ దేశ మాజీ క్రికెటర్‌కే కోచ్‌గా బాధ్యతలు అప్పగించారు.

త్వరలో శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాదేశ్ కోచ్ హతురసింఘ తన జాతీయ జట్టును మంచి నేర్పుతో సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టు తర్వాత సిరీస్ లో అయినా గెలుస్తుందో లేదో చూడాలి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 30, 2017, 14:58 [IST]
Other articles published on Dec 30, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+