Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మానసికంగా సిద్ధమవుతున్నా: క్రికెట్‌కు రిటైర్మెంట్‌పై మలింగ

Lasith Malinga

హైదరాబాద్: శ్రీలంక స్పీడ్ బౌలర్ లసిత్‌ మలింగ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తా అంటున్నాడు. 'క్రికెట్‌కు దూరం అయ్యేందుకు మానసికంగా సిద్ధమవుతున్నా. భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాలన్న దాని గురించి ఆలోచించడం లేదు. నా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాను. అందరూ ఏదో ఒక రోజు ఆటకు దూరం కావల్సిన వారే' అని మలింగ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నాడు.

'దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు నా శరీరం ఏ విధంగా సహకరిస్తుందో చూడాలి. ఐపీఎల్‌లో క్రికెటర్ గానూ నా కెరీర్‌ ముగిసింది. ముంబై ఇండియన్స్‌తో కలిసి మరో అధ్యాయానికి మొదలుపెట్టబోతున్నాను. ముంబై ఇండియన్స్‌ నన్ను రిటెన్షన్‌లో తీసుకోలేదని మాత్రం ఈ నిర్ణయం తీసుకోలేదు.' అని ముంబై ఇండియన్స్ తో తనకున్న సంబంధం గురించి ఇలా వివరించాడు.

తాను ముంబై తరఫున 10ఏళ్లు ఆడి ఎన్నో సాధించానన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలానికి ముందే యాజమాన్యం తనతో సంప్రదింపులు జరిపిందని తెలిపాడు. వచ్చే మూడేళ్ల కోసం మంచి జట్టును తయారు చేయాలనుకుంటున్నట్లు జట్టు యాజమాన్యం తెలిపిందన్నాడు. అప్పుడే యువ ఆటగాళ్లతో పోటీ పడే సామర్థ్యం నాలో తగ్గిపోయిందని తనకు అర్థమైందని వివరించాడు.

తాజాగా మలింగ ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ మార్గనిర్దేశకుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. 'ఇప్పుడు నా వయసు 34. నేను రిటైర్మెంట్‌ యోచనలో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్‌ మెంటార్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది' అని మలింగ వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 21:11 [IST]
Other articles published on Feb 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+